Anand Deverakonda: నా మనసును గెలుచుకున్నావ్ ఆనంద్.. టిష్యూపై అభిమాన లేఖ.. హీరో ఎమోషనల్ ట్వీట్..

పుష్పక విమానం సినిమాతో తనలోని కామెడీ టైమింగ్‏తో కడుపుబ్బా నవ్వించాడు. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కానీ బేబీ సినిమాతో ఆనంద్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ట్రైయాంగిల్ ప్రేమకథలో ఆనంద్, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య తమ అద్భుతమైన నటనతో మెప్పించారు. ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్ అబ్బాయిగా తన నటనతో కన్నీళ్లు పెట్టించాడు ఆనంద్.

Anand Deverakonda: నా మనసును గెలుచుకున్నావ్ ఆనంద్.. టిష్యూపై అభిమాన లేఖ.. హీరో ఎమోషనల్ ట్వీట్..
Anand Deverakonda
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 23, 2023 | 7:35 PM

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా దొరసాని సినిమాతో తెరంగేట్రం చేశారు ఆనంద్ దేవరకొండ. మొదటి సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా.. నటనపరంగా మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత పుష్పక విమానం సినిమాతో తనలోని కామెడీ టైమింగ్‏తో కడుపుబ్బా నవ్వించాడు. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కానీ బేబీ సినిమాతో ఆనంద్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ట్రైయాంగిల్ ప్రేమకథలో ఆనంద్, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య తమ అద్భుతమైన నటనతో మెప్పించారు. ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్ అబ్బాయిగా తన నటనతో కన్నీళ్లు పెట్టించాడు ఆనంద్. ఇందులో అతడి పాత్ర యూత్‏కు ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమాతో ఆనంద్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఆనంద్.. తన ఇన్ స్టా స్టోరీలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇటీవల ఇండిగో విమానంలో ప్రయాణించిన అతడికి ఇండిగో పైలట్ నుంచి ఓ లెటర్ వచ్చింది. ఆనంద్ వర్క్ మెచ్చుకుంటూ టిష్యూపై లేఖ రాసి అందించాడు సదరు పైలట్ సుభాష్. ఈ విషయాన్ని ఇన్ స్టా స్టోరీలో వెల్లడించాడు ఆనంద్.. “హాయ్ డియర్ ఆనంద్. బేబీ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను. ఆ సినిమాతో మీరు నా మనసు గెలుచుకున్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి మంచి చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నాను. అలాగే విజయ్ దేవరకొండకు హాయ్ చెప్పండి” అంటూ టిష్యూపై రాసిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. సంతోషం వ్యక్తం చేశారు ఆనంద్.

Anand

Anand

సుభాష్ తన రోజును ఎంతో ప్రత్యేకం చేశాడని.. మన పనిని ఎదుటి వ్యక్తులు గుర్తించి ప్రశంసిస్తే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించలేము. ఇంకా కెరీర్ లో మరిన్ని సాధించడమే లక్ష్యం అంటూ రాసుకొచ్చారు ఆనంద్. ప్రస్తుతం గం గం గణేశా సినిమాలో నటిస్తున్నారు ఆనంద్. ఈ చిత్రానికి ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదే కాకుండా మరోసారి సాయి రాజేష్ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇందులోనూ మళ్లీ వైష్ణవి చైతన్య జోడిగా కనిపించనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.