Allu Arjun: అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. అక్కడ కొలువుదీనున్న ఐకాన్‌ స్టార్‌ విగ్రహం!

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇటీవలే జాతీయ ఉత్తమ నటుడి పురస్కారానికి ఎంపికయ్యారు. పుష్ప సినిమాలో స్టైలిష్ స్టార్‌ అద్భుత నటనకు గానూ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం వరించింది.ప్రస్తుతం ఈ సంతోషంలో ఉన్న అల్లు అర్జున్‌ను మరో అరుదైన గౌరవం దక్కినట్లు తెలుస్తోంది

Allu Arjun: అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. అక్కడ కొలువుదీనున్న ఐకాన్‌ స్టార్‌ విగ్రహం!
Allu Arjun

Updated on: Sep 19, 2023 | 4:25 PM

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇటీవలే జాతీయ ఉత్తమ నటుడి పురస్కారానికి ఎంపికయ్యారు. పుష్ప సినిమాలో స్టైలిష్ స్టార్‌ అద్భుత నటనకు గానూ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం వరించింది.ప్రస్తుతం ఈ సంతోషంలో ఉన్న అల్లు అర్జున్‌ను మరో అరుదైన గౌరవం దక్కినట్లు తెలుస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో అతని మైనపు విగ్రహం కొలువుదీరనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన సన్నాహకాలు కూడా మొదలైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అల్జు అర్జున్ త్వరలోనే లండన్ మ్యూజియాన్ని సందర్శించడంతోపాటు, తన మైనపు విగ్రహం తయారుచేయడానికి అవసరసమైన శరీర కొలతలను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్తను బన్నీ అభిమానులు సోషల్‌ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం అల్లు అర్జున్‌ ఖాతాలో మరో అరుదైన ఘనత చేరినట్లే. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన ప్రభాస్‌, మహేష్‌ బాబు మైనపు విగ్రహాలు మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఉన్నాయి. వీరే కాదు బాలీవుడ్‌, కోలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటుల విగ్రహాలు ఈ ప్రతిష్ఠాత్మక మ్యూజియంలో కొలువు దీరాయి. అయితే ఈ టుస్సాడ్స్‌ మ్యూజియంలో స్థానం దక్కించుకున్న మొదటి భారతీయ సెలబ్రిటీ బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్‌. ఆసియాలో కూడా ఆయనే మొదటి వ్యక్తి కావడం విశేషం. ఆతర్వాత అందాల తార ఐశ్వర్యారాయ్‌, షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌, మాధురీ దీక్షిత్‌, కరీనా కపూర్‌, కాజల్‌ అగర్వాల్‌ తదిరత సెలబ్రిటీల మైనపు విగ్రహాలు టుస్సాడ్స్‌ మ్యూజియంలో కొలువు దీరాయి. ఇప్పుడు అల్లు అర్జున్‌ కూడా ఈ జాబితాలో చేరనున్నట్లు సమాచారం.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పుష్ప 2 ..దిరూల్‌ సినిమాతో బిజీగా ఉంటున్నాడు అల్లు అర్జున్‌. ప్రస్తుతం ఈ సీక్వెల్‌ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. సుకుమార్‌ తెరకెక్కిస్తోన్న ఈ మాస్‌ యాక్షన్‌ మూవీలో రష్మిక మంధాన హీరోయిన్‌గా నటిస్తోంది .అలాగే ఫాహద్‌ ఫాజిల్‌, అనసూయ, సునీల్‌, ధనుంజయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సమంత ఓ స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేసింది. ఇక రెండో పార్ట్‌లో మరికొంతమంది స్టార్‌ నటీనటులు కనిపించవచ్చని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై యెర్నేనీ నవీన్‌, యలమంచిలి రవిశంకర్‌ పుష్ప2 సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాకే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు దేవిశ్రీ ప్రసాద్‌. ఇలా జాతీయ అవార్డులు రావడంతో పుష్ప సీక్వెల్‌పై అంచనాలు పెరిగాయి. వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న పుష్ప 2 థియేటర్లలోకి అడుగుపెట్టనున్నాడు.

ఇవి కూడా చదవండి

పుష్ప 2 షూట్ లో అల్లు అర్జున్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.