Pushpa 2: దంగల్‌ను బీట్ చేసే దిశగా పుష్ప 2.. 25రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే

|

Dec 31, 2024 | 1:36 PM

పుష్ప 2’ సినిమా రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతుంది. డిసెంబర్ 5న విడుదలైన పుష్ప2 సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా 17 వందల కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో అల్లు అర్జున్ అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు.

Pushpa 2: దంగల్‌ను బీట్ చేసే దిశగా పుష్ప 2.. 25రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
Pushpa 2
Follow us on

అల్లు అర్జున్ ‘పుష్ప 2’ దండయాత్ర ఆగడం లేదు. ఈ తుపాను ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇప్పటికే రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ‘పుష్ప 2′ మేకర్స్ అఫీషియల్ గా ఓ పోస్టర్ విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 25 రోజుల కలెక్షన్స్ రూ. 1760 కోట్లు వసూల్ చేసింది.ఇక ఇప్పుడు ఈ చిత్రం 25 వ రోజు ఇండియాలో రూ.6.65 కోట్ల రూపాయలబిజినెస్ చేసింది. గతంతో పోలిస్తే పుష్ప 2 వసూళ్లు కొంత తగ్గాయి. తెలుగులో రూ.1.22 కోట్లు, హిందీలో రూ.5.25 కోట్లు వసూలు చేసింది. అదే సమయంలో తమిళంలో రూ.0.15 కోట్లు, కన్నడలో రూ.0.02 కోట్లు, మలయాళంలో రూ.0.01 కోట్ల బిజినెస్ జరిగింది పుష్ప 2.

ఇండియాలో’పుష్ప 2’ మొత్తం నెట్ వసూళ్లు రూ.1163 కోట్లకు చేరాయి. త్వరలో ఈ సినిమా కూడా ఇండియాలో  రూ.1200 కోట్లు రాబట్టనుంది. అయితే అంతకంటే ముందు ఏయే భాషల్లో మొత్తం ఎంత వసూల్ చేసిందో ఓసారి చూద్దాం. ప్రపంచ వ్యాప్తంగా పుష్ప2 సినిమా రూ.1760 కోట్లు రాబట్టింది. ప్రస్తుతానికి బాహుబలి 2 రికార్డును ప్రభాస్ బ్రేక్ చేయలేదు ఈ సినిమా.

బాహుబలి ప్రపంచవ్యాప్తంగా రూ. 1788.06 కోట్లు రాబట్టింది. త్వరలోనే పుష్ప 2 బాహుబలి 2 ని బీట్ చేసేలా కనిపిస్తుంది. ఆతర్వాత అమీర్ ఖాన్ ‘దంగల్’ పై కన్నేసింది. ఇప్పుడు పుష్ప 2 చిత్రం రూ. 2000 కోట్ల మార్క్‌ను దాటడానికి 2 వారాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. వీకెండ్‌లో ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టడం విశేషం. వీక్ డేస్ లో కూడా కలెక్షన్స్ తక్కువగానే ఉన్నా, వీకెండ్స్ లో మాత్రం ప్రతిసారి మంచి వసూళ్లు వస్తున్నాయి. 25వ రోజు పుష్ప 2 హిందీలో రూ.5.25 కోట్ల బిజినెస్ చేసింది. ఇది షారుక్ ఖాన్ జవాన్ కంటే తక్కువ. జవాన్ సినిమా 6.65 కోట్లు వసూలు చేసింది. 26వ రోజు అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల జాబితాలో అల్లు అర్జున్ రెండో స్థానంలో ఉన్నాడు.  ఇక ఈ లిస్ట్ లో షారుఖ్ ఖాన్  పఠాన్, శ్రద్ధా కపూర్ స్త్రీ 2 అలాగే ప్రభాస్ బాహుబలి 2 వంటి అనేక చిత్రాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.