‘ఆస్కార్’ టార్గెట్‌గా అల్లు అర్జున్ ‘పుష్ప 2’.. ప్రీ-రిలీజ్ హైప్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.!
నిన్నటి వరకు అల్లు అర్జున్ ఐకాన్ స్టార్.. పాన్ ఇండియన్ హీరో..! కానీ ఇప్పుడు ఆయన నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్. తెలుగు ఇండస్ట్రీలో మొట్టమొదటి జాతీయ అవార్డు విజేత. మరి ఈ అదనపు బాధ్యత బన్నీపై ఎలాంటి ఒత్తిడి పెంచబోతుంది..? నేషనల్ అవార్డ్ తర్వాత అల్లు అర్జున్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది..?
నిన్నటి వరకు అల్లు అర్జున్ ఐకాన్ స్టార్.. పాన్ ఇండియన్ హీరో..! కానీ ఇప్పుడు ఆయన నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్. తెలుగు ఇండస్ట్రీలో మొట్టమొదటి జాతీయ అవార్డు విజేత. మరి ఈ అదనపు బాధ్యత బన్నీపై ఎలాంటి ఒత్తిడి పెంచబోతుంది..? నేషనల్ అవార్డ్ తర్వాత అల్లు అర్జున్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది..? పుష్ప 2కు ఈ అవార్డును ఎలా వాడుకోబోతున్నారు..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..
కొన్ని సినిమాలపై ముందు నుంచి ఉండే అంచనాల కంటే.. వాటికి వచ్చే అవార్డులు, ప్రశంసలు చూసాక మరింతగా హైప్ పెరుగుతుంది. అందులో పుష్ప గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమా విడుదలైనపుడు చేసిన రచ్చ కంటే.. ఆ తర్వాత చేసే సందడే ఎక్కువగా కనిపిస్తుంది. నేషనల్, ఇంటర్నేషనల్ సెలెబ్రిటీస్ చాలా మంది పుష్ప మేనియాలో చాలా కాలం పాటు ఉన్నారు.. ఇదే పుష్పను ప్రపంచానికి పరిచయం చేసింది.
పుష్పకు ముందు అల్లు అర్జున్ తెలుగు హీరో.. మలయాళంలోనూ మంచి మార్కెట్ ఉన్న హీరో మాత్రమే. కానీ ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ అయిపోయారు.. ఇంకా మాట్లాడితే పాన్ వరల్డ్ అయ్యారు ఐకాన్ స్టార్. పుష్ప మేనరిజమ్స్ ఎలక్షన్ ప్రచారాల్లో మంత్రులు కూడా వాడుకున్నారంటే ఇంపాక్ట్ అర్థమైపోతుంది. ఇప్పుడు అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడంతో సీక్వెల్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
#Pushpa2TheRule Begins!!! pic.twitter.com/FH3ccxGHb8
— Allu Arjun (@alluarjun) April 7, 2023
పుష్ప పాత్రను అల్లు అర్జున్ ఓన్ చేసుకున్న తీరుకే అంతా ఫిదా అయిపోయారు. నిజానికి అది స్మగ్లర్ కారెక్టర్ అయినా.. అందులోనూ హీరోయిజం నెక్ట్స్ లెవల్‌లో చూపించారు సుకుమార్. అవార్డు రావడంతో.. సీక్వెల్‌పై అంచనాలతో పాటు అదనపు బాధ్యత కూడా పెరిగింది. 1000 కోట్లే లక్ష్యంగా పుష్ప 2తో దండయాత్రకు సిద్ధమవుతున్నారు బన్నీ అండ్ టీం. 2024లో పుష్ప ది రూల్ విడుదల కానుంది.
పుష్ప 2 ముందున్న మరో లక్ష్యం ఆస్కార్. ఇదివరకైతే ఆస్కార్ అంటే మనకు సంబంధం లేనట్లే ఉండేవాళ్లం కానీ మొన్న ట్రిపుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చాక.. అది కూడా మన కప్ ఆఫ్ టీ అంటున్నారు దర్శక నిర్మాతలు. అందుకే పుష్ప 2 కోసం ఇప్పట్నుంచే ఆస్కార్‌కు రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. దానికి నేషనల్ అవార్డ్ కూడా బూస్టప్ ఇవ్వనుంది. మొత్తానికి చూడాలి.. ఈ అవార్డ్ అల్లు అర్జున్ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపించబోతుందో..?