Pushpa 2: హైదరాబాద్‏లో పుష్పగాడి వైల్డ్ ఫైర్ జాతర.. అసలు విషయం చెప్పిన మేకర్స్..

|

Nov 30, 2024 | 9:27 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 డిసెంబర్ 5న విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ క్రమంలో వరుస ప్రమోషన్లతో బిజీగా ఉంది చిత్రయూనిట్.

Pushpa 2: హైదరాబాద్‏లో పుష్పగాడి వైల్డ్ ఫైర్ జాతర.. అసలు విషయం చెప్పిన మేకర్స్..
Pushpa 2
Follow us on

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్న సినిమా పుష్ప 2. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ సినిమా భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రమోషన్స్ విభిన్నంగా నిర్వహిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు మేకర్స్. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబై ప్రాంతాల్లో పుష్ప 2 ఈవెంట్స్ నిర్వహించారు. ఇక ఇప్పుడు తెలుగు అడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

తాజాగా పుష్ప 2 వైల్డ్ ఫైర్ జాతర ఈవెంట్ ను హైదరాబాద్ ను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకను యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నారు. ఈ వేడుకను అచ్చం ప్రీ రిలీజ్ ఈవెంట్ లెవల్లో చేస్తున్నారు. డిసెంబర్ 2న సాయంత్రం 6 గంటలకు యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నామని మేకర్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ వేడుకకు దాదాపు 2 లక్షలకు పైగా ఫ్యాన్స్ హాజరుకానున్నట్లు అంచనా వేస్తున్నారు మేకర్స్. దీంతో భారీ బందోబస్తు మధ్యలో పుష్పగాడి మాస్ జాతర నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

పుష్ప 2 సినిమాకు నార్త్ లో ఓ రేంజ్ క్రేజ్ నెలకొంది. గతంలో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన పుష్ప ది రైజ్ సినిమాతో ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ పై మరింత హైప్ నెలకొంది. దీంతో ఇప్పుడు పుష్ప 2 ప్రమోషన్స్ వేగంగా నిర్వహిస్తున్నారు మేకర్స్. ఇందులో రష్మిక, ఫహద్ ఫాజిల్, జగపతి బాబు కీలకపాత్రలు పోషిస్తుండగా.. శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తుంది.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.