Parugu: ఇదేందయ్యా ఇది.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అల్లు అర్జున్ హీరోయిన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో పరుగు సినిమా ఒకటి. పరుగు సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
చాలా మంది హీరోయిన్ ఒకప్పుడు రాణించి ఇప్పుడు కనుమరుగయ్యారు. ఒకటి రెండు సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకొని ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. ఇక ఇలా కనిపించకుండా మాయమైన హీరోయిన్స్ లో షీలా ఒకరు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో పరుగు సినిమా ఒకటి. పరుగు సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా షీలా నటించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో తండ్రి కూతుర్ల మధ్య ఉండే ఎమోషన్ ను చూపించారు దర్శకుడు భాస్కర్.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించినషీలా ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకునేందుకు నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. పరుగు సినిమా తర్వాత షీలా పలు తెలుగు ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమాలోనూ కనిపించింది ఈ భామ. ఆతర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయింది.
ఇదిలా ఉంటే ఈ అమ్మడు చివరిగా తెలుగులో బాలకృష్ణ నటించిన పరమవీర చక్ర సినిమాలో కనిపించింది. తెలుగుతో పాటు తమిళ్ మలయాళ సినిమాల్లోనూ నటించింది ఈ చిన్నది. 2018 తర్వాత ఈ అమ్మడు సినిమాల్లో నటించలేదు. 2020లో సంతోష్ రెడ్డిని వివాహం చేసుకుంది. అప్పటి నుంచి సినిమాలకు దూరం అయ్యి ఫ్యామిలీతో గడుపుతోంది. తాజాగా ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
View this post on Instagram