AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allari Naresh: నా సినిమా షూటింగ్ టైమ్‌లోనే నాన్న చనిపోయారు.. ఇప్పటికీ ఆ మూవీ చూడలేదు, చూడను కూడా

డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అల్లరి నరేష్. హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నాడు. అయితే ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ అల్లరోడు తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.

Allari Naresh: నా సినిమా షూటింగ్ టైమ్‌లోనే నాన్న చనిపోయారు.. ఇప్పటికీ ఆ మూవీ చూడలేదు, చూడను కూడా
Allari Naresh
Basha Shek
|

Updated on: Apr 09, 2026 | 7:04 PM

Share

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు ఈవీవీ సత్యనారాయణ. 1982లో నాలుగు స్తంభాలాట సినిమాతో మొదలైంది ఆయన సినీ ప్రస్థానం. రెండు జెళ్ల సీత, రెండు రెళ్ల ఆరు, సీతారామ కల్యాణం, అహనా పెళ్లంట వంటి సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన ఆయన చెవిలో పువ్వు సినిమాతో డైరెక్టర్ గా మారిపోయారు. ప్రేమ ఖైదీ, సీతారత్నం గారీ అబ్బాయి, ఆ ఒక్కటి అడక్కు, ఆలీబాబా అరడజను దొంగలు, అబ్బాయిగారు, జంబలకిడి పంబ, అల్లుడా మజకా, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు, మా నాన్నకు పెళ్లి, ఆవిడా మా ఆవిడే, సూర్య వంశం, అమ్మో ఒకటో తారీఖు,తొట్టి గ్యాంగ్, ఎవడి గోల వాడిది, కితకితలు, కత్తి కాంతారావు.. ఇలా సుమారు 50 సూపర్ హిట్ సినిమాలను తెలుగు ఆడియెన్స్ కు అందించారు ఈవీవీ. అయితే దర్శకునిగా బిజీగా ఉన్న సమయంలోనే తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారీ స్టార్ డైరెక్టర్. 2011 జనవరి 21న ఆయన తుది శ్వాస విడిచారు. అయితే ఈవీవీ సత్య నారాయణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు అల్లరి నరేష్ ఓ సినిమా క్లైమాక్స్ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉందట. ఆ రోజు వదిలితే మిగిలిన స్టార్ కమెడియన్స్ డేట్స్ దగ్గర్లో ఖాళీ లేవు. అందుకే ఆ రోజు ఎలాగైనా షూటింగ్ చేయాల్సి వచ్చిందట.

ఓవైపు తండ్రి గురించి ఆరోగ్య పరిస్థితి గురించి మథనపడుతున్న అల్లరి నరేష్ కి షూటింగ్ చేయడం ఏ మాత్రం ఇష్టం లేదట. కానీ నిర్మాతల డబ్బు ను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు షూటింగ్ కంప్లీట్ చేశారట. ఓ వైపు వైద్యులు వాళ్ల నాన్నకు చాలా సీరియస్ గా ఉందని చెబుతునే ఉన్నా అల్లరోడు షూటింగ్ లో పాల్గొన్నాడట. ఏడుపు వస్తున్నా కామెడీ సీన్స్ షూట్ చేశారట. ఎలాగోలా సాయంత్రానికి సినిమా షూట్ అయిపోయింది. అయితే దురదృష్టవశాత్తూ అదే సాయంత్రం ఈవీవీ సత్యనారాయణ కన్నుమూశారట. ఈ విషయాన్ని అల్లరి నరేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సీమ టపాకాయ్ సినిమా షూటింగ్ సమయంలో నాన్న చనిపోయారు. దీంతో ఇప్పటివరకు కూడా నేను ఆ సినిమా చూడలేద. ఇకపై కూడా చూడను. ఆ సినిమాని తలుచుకుంటే మా నాన్న మరణమే గుర్తొస్తుంది’ అని బాగా ఎమోషనల్ అయ్యాడు ఈవీవీ. అల్లరి నరేష్ – పూర్ణ కాంబోలో తెరకెక్కిన సీమ టపాకాయ్ సినిమా 2011 మేలో రిలీజై సూపర్ హిట్ గా నిలిచింది. అల్లరోడి సినిమా కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే అల్లరి నరేష్ తండ్రి చనిపోవడం శోచనీయం.

ఇవి కూడా చదవండి

భార్యతో అల్లరి నరేష్..

ఇక అల్లరి నరేష్ సినిమాల విషయానికి వస్తే.. గతేడాది 12A రైల్వే కాలనీ అనే సినిమాలో నటించాడు అల్లరోడు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో ఆల్కహాల్, సభకు నమస్కారం సినిమాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us