AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: లాంగ్ రన్‌కు కేరాఫ్ అడ్రస్ అల్లు అర్జున్.. ఇదేమి అరాచకం సామి..?

పుష్ప 2తో తన సత్తా ఏంటో చూపించాడు అల్లు అర్జున్. మనోడి ఫెర్ఫామెన్స్‌కు బాక్సాఫీసు షేక్ అయింది. కలెక్షన్ల ఊచకోత నడుస్తోంది. 50 డేస్ దాటాక కూడా కలెక్షన్స్ రాబుడుతుంది. ఈ రోజుల్లో ఇలాంటి ఫీట్ ఎవరికైనా సాధ్యం అవుతుందా..? అందుకే అల్లు అర్జున్‌ని ఐకాన్ స్టార్ అనేది...

Allu Arjun: లాంగ్ రన్‌కు కేరాఫ్ అడ్రస్ అల్లు అర్జున్.. ఇదేమి అరాచకం సామి..?
Pushpa 2
Praveen Vadla
| Edited By: |

Updated on: Jan 26, 2025 | 5:55 PM

Share

ఈ రోజుల్లో ఓ సినిమా వారం రోజులు ఆడటమే గగనంగా మారిపోయింది. విడుదలైన తర్వాత మూడు రోజులు హౌజ్ ఫుల్ బోర్డులు పడితే చాలురా బాబూ.. ఆ తర్వాత నాలుగు రోజులు ఎలాగోలా వెళ్లిపోతుంది అనుకుంటున్నారు నిర్మాతలు. ఇక రెండో వారం కూడా బాగా పర్ఫార్మ్ చేస్తే అది అదృష్టమే.. మూడో వారం అంటే అద్భుతమే. కానీ ఆ అద్భుతాలు చాలా తక్కువగా వస్తున్నాయిప్పుడు. అయితే ఈ సమయంలో కూడా ఓ హీరో సినిమాలు మాత్రం మూడు నాలుగు వారాలు కాదు ఏకంగా నెల రోజులకు పైగానే ఆడుతున్నాయి.. థియేటర్లలో షేర్ తీసుకొస్తున్నాయి. అతనెవరో కాదు అల్లు అర్జున్.

గత కొన్నేళ్లుగా బన్నీ సినిమాలకు థియెట్రికల్ రెవిన్యూ బాగా వస్తుంది. మరీ ముఖ్యంగా అల వైకుంఠపురములో తర్వాత అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. అదే రెవిన్యూలోనూ కనిపిస్తుంది. కావాలంటే చూడండి పుష్ప 2 వచ్చి 50 రోజులైంది.. ఇప్పటికీ కొన్ని థియేటర్స్‌లో ఆడుతుంది ఈ సినిమా. 1800 కోట్లకు పైగా వసూలు చేసిన పుష్ప 2కు 40 రోజులు దాటిన తర్వాత.. సంక్రాంతి సినిమాలు కూడా విడుదలైన తర్వాత కూడా రన్ కంటిన్యూ అయింది.. థియేటర్స్ నుంచి మినిమమ్ షేర్ వచ్చింది. అంతేకాదు 30 రోజుల వరకు కూడా చాలా చోట్ల హౌజ్ ఫుల్స్‌తో నడిచింది పుష్ప 2. తెలుగు రాష్ట్రాల కంటే నార్త్‌లో అయితే 40 రోజులు నాన్ స్టాప్ బ్యాటింగ్ చేసాడు బన్నీ.

ఇక మూడేళ్ళ కింద పుష్ప విషయంలోనూ ఇదే జరిగింది. తెలుగులో 17 రోజులకే ఓటిటిలో వచ్చినా.. నార్త్‌లో మాత్రం 50 రోజులకు పైగానే థియెట్రికల్ రెవిన్యూ తీసుకొచ్చింది పుష్ప. 2020లో వచ్చిన అల వైకుంఠపురములో సైతం 40 రోజులకు పైగానే ఆడింది. ఈ చిత్రం అప్పట్లో కొన్ని సెంటర్లలో 100 రోజులు కూడా ఆడిందంటే అతిశయోక్తి కాదు. మొత్తానికి లాంగ్ రన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాడు అల్లు వారబ్బాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రాత పరీక్ష లేకుండానే.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు!
రాత పరీక్ష లేకుండానే.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు!
రోహిత్ తొలగింపు వెనుక గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా ?
రోహిత్ తొలగింపు వెనుక గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా ?
JEE Main 2026 మీ ఫైనల్ ప్రిపరేషన్‌ ఇలా ఉంటే.. టాప్ ర్యాంక్ మీదే!
JEE Main 2026 మీ ఫైనల్ ప్రిపరేషన్‌ ఇలా ఉంటే.. టాప్ ర్యాంక్ మీదే!
ఉజ్జయినిలో భక్తి పారవశ్యంలో మునిగిపోయిన స్టార్ క్రికెటర్లు
ఉజ్జయినిలో భక్తి పారవశ్యంలో మునిగిపోయిన స్టార్ క్రికెటర్లు
హాఫ్ సెంచరీ చేసి 6 ఏళ్లు దాటిందిగా.. వరుస ఫ్లాప్ షోలతో భారంగా..
హాఫ్ సెంచరీ చేసి 6 ఏళ్లు దాటిందిగా.. వరుస ఫ్లాప్ షోలతో భారంగా..
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
పంజాబ్ పీచమణిచిన సౌరాష్ట్ర సింహం..సెమీఫైనల్లో 165 పరుగులతో ఊచకోత
పంజాబ్ పీచమణిచిన సౌరాష్ట్ర సింహం..సెమీఫైనల్లో 165 పరుగులతో ఊచకోత
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
గోల్డ్‌లోన్‌ ట్రై చేస్తున్నారా?ఫిబ్రవరి 1 వరకు వెయిట్‌ చేయండి
గోల్డ్‌లోన్‌ ట్రై చేస్తున్నారా?ఫిబ్రవరి 1 వరకు వెయిట్‌ చేయండి