Poacher: క్రైం స్టోరీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ‘పోచర్’ రిలీజ్ డేట్ లాక్
పోచర్ అనే క్రైమ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ సంస్థ క్యూసీ ఎంటర్‌టైన్‍మెంట్ ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తోంది. అలాగే ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా నిర్మాతగా వ్యవహరించారు. పోచర్ వెబ్ సిరీస్ కు రిచీ మెహతా దీనికి రచన, దర్శకత్వం వహించారు. నిమిషా సజయన్, రోషన్ మథ్యూ, దివ్యేంద్ర భట్టాచార్య ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

ఓటీటీలో ఇప్పటికే చాలా సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా ఓటీటీలో ఓ ఇంట్రెస్టింగ్ క్రైం థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. పోచర్ అనే క్రైమ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ సంస్థ క్యూసీ ఎంటర్‌టైన్‍మెంట్ ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తోంది. అలాగే ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా నిర్మాతగా వ్యవహరించారు. పోచర్ వెబ్ సిరీస్ కు రిచీ మెహతా దీనికి రచన, దర్శకత్వం వహించారు. నిమిషా సజయన్, రోషన్ మథ్యూ, దివ్యేంద్ర భట్టాచార్య ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. క్రైం థ్రిల్లర్స్ ను ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు ఈ వెబ్ సిరీస్ తప్పకుండా ఆకట్టుకుంటుందని మేకర్స్ అంటున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.
ఫిబ్రవరి 23 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనుంది. పోచర్ వెబ్ సిరీస్‍లో 8 ఎపిసోడ్లు ఉండనున్నాయి. ఇటీవలే ఈ వెబ్ సిరీస్ ను సుడాన్స్ ఫిల్మ్స్ ఫెస్టివల్‍లో ప్రదర్శించారు. ఇక ఇప్పుడు అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌లో అడవుల్లో వన్య ప్రాణుల పై జరిగే దాడుల గురించి చూపించారు.
ముందుగా ఏనుగుల పై జరిగే దాడుల గురించి ఈ వెబ్ సిరీస్ లో చూపించనున్నారు. ఈ సినిమాను ఎక్కువగా అడవుల్లో షూటింగ్ చేశారు. కేరళలోని అడవుల్లో ఈ సినిమా షూటింగ్ చేశారు. ఏనుగు దంతాల నెట్‍వర్క్ గుట్టు రట్టు చేసేందుకు కృషి చేసిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులతో కలిసి పోలీసులు చేసిన కృషిని ఈ సినిమాలో చూపించనున్నారు.
beneath the silence, the forest reveals a deadly conspiracy… and the hunt for the Poacher begins!
Alia Bhatt comes on board as #ExecutiveProducer on #PoacherOnPrime, a new Amazon Original Crime series, Feb 23@aliaa08 #RichieMehta @_QCEnt @NimishaSajayan @roshanmathew22… pic.twitter.com/B8RmMPMtRK
— prime video IN (@PrimeVideoIN) February 6, 2024
అలియా భట్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




