సెట్స్‌లో కొట్టకున్న అక్షయ్ కుమార్, రోహిత్ శెట్టి..అసలు ఏమైంది..?
బాలీవుడ్ కిలాడి హీరో..అగ్ర దర్శకుడు రోహిత్ శెట్టి ఇద్దరూ సినిమా షూటింగ్ సెట్‌లో దెబ్బలాడుకున్నారు. అది కూడా సాదాసీదాగా కూడా కాదు. అటు 10మంది..ఇటు 10 మంది వచ్చి విడదీస్తే కానీ గొడవ సద్దుమణగలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అసలు ఏమైందనేగా మీ డౌబ్డ్..? అక్కడికే వస్తున్నాం.. కిలాడి హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా లో బ్యాగ్రౌండ్ వచ్చిన అక్షయ్..బాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగారు. […]

బాలీవుడ్ కిలాడి హీరో..అగ్ర దర్శకుడు రోహిత్ శెట్టి ఇద్దరూ సినిమా షూటింగ్ సెట్‌లో దెబ్బలాడుకున్నారు. అది కూడా సాదాసీదాగా కూడా కాదు. అటు 10మంది..ఇటు 10 మంది వచ్చి విడదీస్తే కానీ గొడవ సద్దుమణగలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అసలు ఏమైందనేగా మీ డౌబ్డ్..? అక్కడికే వస్తున్నాం..
కిలాడి హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా లో బ్యాగ్రౌండ్ వచ్చిన అక్షయ్..బాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగారు. అంతేకాదు వివిధ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ తన మంచి మనసును చాటుకుంటున్నాడు. ఇక అక్షయ్ సెట్స్‌లో ఎంతో జోవియల్‌గా, ఏమాత్రం ఇగో లేకుండా అందరిని ఒకేలా ట్రీట్ చేస్తారని టాక్.
ప్రస్తుతం అక్షయ్..’సూర్యవంశీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీని బాలీవుడ్ అగ్రదర్శకుడు రోహిత్ శెట్టి డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే మూవీ సెట్స్‌లో అక్షయ్, రోహిత్ శెట్టి కొట్టుకున్నారని..ఇద్దరి మధ్య క్రియేటీవ్ డిఫరెన్సెస్ వచ్చాయని..ఓ వార్తా సంస్థ కథనాన్ని రాసింది. దీంతో అక్షయ్..సదరు సంస్థకు ఫన్నీ వేలో కౌంటరిస్తూ..సెట్‌లో కొట్టుకుంటున్నట్లు తీసిన వీడియోను సోషల్ మీడియాలో ఫోస్ట్ చేశాడు. దీంతో అటు ప్రమోషన్‌తో పాటు..తమ మధ్య ఏం విభేదాలు లేవని క్లియర్‌గా చెప్పేశాడు అక్షయ్. ఈ వీడియో చూసి కిలాడీ హీరోనా..మాజాకా అంటూ నెటిజన్లు కౌంటర్ వేస్తున్నారు.
#BreakingNews – A fallout which might just make your day ? pic.twitter.com/gH2jgTQqhT
— Akshay Kumar (@akshaykumar) November 12, 2019