AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Ghost Movie: స్పీడ్ పెంచిన నాగార్జున.. ది ఘోస్ట్ కొత్త షెడ్యూల్ ప్రారంభం..

అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఈ ఏడాదిని బ్లాక్ బస్టర్ హిట్‏తో ప్రారంభించాడు. సంక్రాంతి కానుకగా బంగార్రాజు సినిమాతో

The Ghost Movie: స్పీడ్ పెంచిన నాగార్జున.. ది ఘోస్ట్ కొత్త షెడ్యూల్ ప్రారంభం..
The Ghost
Rajitha Chanti
|

Updated on: Apr 08, 2022 | 6:46 PM

Share

అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఈ ఏడాదిని బ్లాక్ బస్టర్ హిట్‏తో ప్రారంభించాడు. సంక్రాంతి కానుకగా బంగార్రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం కింగ్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ది ఘోస్ట్. ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దరకత్వం వహిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు వున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో హీరోలను మునుపెన్నడూ చూడని పాత్రల్లో ప్రజెంట్ చేయడంలో పేరుపొందిన ప్రవీణ్ సత్తారు, కింగ్ నాగార్జునని విభిన్నమైన పాత్రలో చూపించి ప్రేక్షకులని థ్రిల్ చేయడానికి వైవిధ్యమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది.

చిత్ర యూనిట్ ఇటీవల దుబాయ్‌లో సుదీర్ఘ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న సోనాల్ చౌహాన్ కూడా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ చిత్రంలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఊటీలో ప్రారంభమైయింది .“ఊటీలో ఉదయాలు ఎప్పుడూ అద్భుతంగా ఉంటాయి” అని ట్వీట్ చేస్తూ దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఊటీ లొకేషన్ స్టిల్ ని అభిమానులతో పంచుకున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోహిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మారర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

Also Read: Bloody Mary: బ్లడీ మేరీ మేకింగ్ వీడియో రిలీజ్.. అంధురాలిగా నివేదా పేతురాజ్..

Salaar: ఫ్యాన్స్‏కు డబుల్ ట్రీట్ ఇవ్వనున్న ప్రశాంత్ నీల్.. సలార్ నుంచి గ్లింప్స్ వచ్చేది అప్పుడేనా ?..

Manchu Vishnu: సన్నీ లియోన్‏ను చూసి భయపడి పారిపోయిన మంచు విష్ణు.. నెట్టింట్లో వైరలవుతున్న వీడియో..

Akira Nandan: అకీరాకు బర్త్ డే విషెస్ చెబుతూ స్పెషల్ వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్..

Ranbir Kapoor Alia Bhatt: బాలీవుడ్‏లో పెళ్లి భజాలు.. రణబీర్ కపూర్, అలియా పెళ్లికి అతిథులు వీరే..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్