AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5: లీకులకు చెక్.. హోస్ట్‌గా ఆయనే..! నో బోరింగ్.. ఓన్లీ ఎంటర్‌టైన్మెంట్‌ అంటోన్న బిగ్ బాస్

బుల్లితెర మీద బిగ్ బాస్‌ సందడి మొదలైంది. ఐదో సీజన్‌ మీద ఉన్న అన్ని అనుమానాలకు ఒకే టీజర్‌తో చెక్‌ పెట్టేశారు మేకర్స్. ముఖ్యంగా హోస్ట్ మారతారా...? ఈ సారి సీజన్‌ కాస్త లేట్ అవుతుందా..

Bigg Boss 5: లీకులకు చెక్.. హోస్ట్‌గా ఆయనే..! నో బోరింగ్.. ఓన్లీ ఎంటర్‌టైన్మెంట్‌ అంటోన్న బిగ్ బాస్
Bigg Boss 5
Venkata Chari
|

Updated on: Aug 15, 2021 | 5:43 PM

Share

Bigg Boss 5: బుల్లితెర మీద బిగ్ బాస్‌ సందడి మొదలైంది. ఐదో సీజన్‌ మీద ఉన్న అన్ని అనుమానాలకు ఒకే టీజర్‌తో చెక్‌ పెట్టేశారు మేకర్స్. ముఖ్యంగా హోస్ట్ మారతారా…? ఈ సారి సీజన్‌ కాస్త లేట్ అవుతుందా..? అన్న డౌట్స్‌ చెక్‌ పెట్టేశారు. బోర్‌డమ్‌ను పక్కన పెట్టి ఎంటర్‌టైన్మెంట్‌కు రెడీ అయిపొయామంటూ గట్టిగానే చెబుతూ ఓ టీజర్ ఇచ్చారు… అయితే ఈ టీజర్‌ రిలీజ్‌ తరువాత కొత్త డిస్కషన్ మొదలైంది.

మామూలుగా బిగ్ బాస్‌ అంటేనే లీకుల వ్యవహారం. హోస్ట్ సెలక్షన్‌ దగ్గర నుంచి… విన్నర్ డెసిషన్‌ వరకు అన్ని ముందే లీకైపోతుంటాయి. గత సీజన్లలో ఇదే జరిగింది. ఈ సారి హోస్ట్ ఎవరన్న అనుమానాలు రెయిజ్‌ అయినా.. త్వరలోనే లీకులొస్తాయ్‌లే అన్న వెయిటింగ్‌లో ఉన్నారు ఆడియన్స్. అందుకే ఈ సారి ఆ ఛాన్స్ ఇవ్వలేదు టీమ్‌.

లీకుల కన్నాముందే రియల్‌ న్యూస్‌తో సర్‌ప్రైజ్‌ చేశాడు బిగ్‌ బాస్‌. హోస్ట్ మారుతున్నారన్న రూమర్స్‌ చెక్‌ పెడుతూ… మరోసారి బిగ్ బాస్‌ డయాస్‌ను రూల్ చేసేందుకు గన్‌ పట్టుకొని బయలు దేరారు నాగ్. అయితే ఎలాంటి హింట్ లేకుండా ఇంత సడన్‌గా బిగ్ బాస్ ఎనౌన్స్‌మెంట్ ఎందుకు ఇచ్చినట్టు ఇదే ఇప్పుడు మీడియా సర్కిల్స్‌లో మరో డిస్కషన్‌. ప్రీలుక్‌, ఫస్ట్ లుక్‌, ప్రీ టీజర్‌, టీజర్‌ అంటూ ఊరిస్తూ అసలు విషయాన్ని రివీల్ చేసే ఈ రోజుల్లో ఇంత సడన్‌గా టీజర్ ఇవ్వటం వెనుక మరెదో మతలబు ఉందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. హోస్ట్ మారిపోతారన్న ప్రచారం మరి ఎక్కువవుతుందన్న భయంతోనే ఇలా తొందరపడ్డారన్నది గట్టిగా వినిపిస్తున్న ఆన్సర్‌.

అంతేకాదు టీజర్‌లో నాగ్ చెప్పిన డైలాగ్స్ మీద కూడా టీజింగ్ జరుగుతోంది. ఇక లాప్‌ట్యాప్‌లు, ఫోన్‌లు పక్కన పెట్టేయండి అంటూ నాగ్ చెప్పటంతో డిజిటల్ వ్యూయర్‌ షిప్‌ వద్దా అంటున్నారు బిగ్ బాస్ ఆడియన్స్. టీఆర్పీ విషయంలో బిగ్ బాస్‌ ఎప్పుడూ టాప్‌లోనే ఉన్నా… ఇది ఓటీటీ జమానా.. ఈ టైమ్‌లో కూడా టెలికాస్ట్‌ టైమ్‌లోనే షో చూడాలంటే అయ్యే పనేనా…? అన్నది ఆన్‌లైన్‌ ఆడియన్స్‌ క్వశ్చన్‌. ఈ డిస్కషన్ సంగతి పెడితే.. ఈసారి బిగ్‌ బాస్ ఎలాంటి టాస్క్‌లతో రాబోతున్నారు… ఎప్పుడు స్క్రీన్‌ మీదకు వస్తారు..? అన్న విషయంలో చర్చ మొదలైంది. (సతీష్, టీవీ9, ఈటీ టీమ్)

Also Read: Shershah Movie: ‘నేనిప్పటిదాకా ఇలాంటి ప్రేమకథ వినలేదు’: బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ

Divi Vadthya : దివి నుంచి దిగివచ్చిన దేవకన్యలా.. అందంతో ఎర వేస్తే ఎలా.. కుర్రాళ్ళ మనసు గిల గిల