AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shershah Movie: ‘నేనిప్పటిదాకా ఇలాంటి ప్రేమకథ వినలేదు’: బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ

వాళ్లిద్దరి పరిచయం నాలుగేళ్లు. అందులో ఒకరినొకరు చూసుకుంటూ గడిపిన సమయం కూడా ఏడాదిలోపే. అయితే అనంతమైన ప్రేమ ఆమె సొంతం...

Shershah Movie: 'నేనిప్పటిదాకా ఇలాంటి ప్రేమకథ వినలేదు': బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ
Shershah Movie
Venkata Chari
|

Updated on: Aug 15, 2021 | 5:34 PM

Share

వాళ్లిద్దరి పరిచయం నాలుగేళ్లు. అందులో ఒకరినొకరు చూసుకుంటూ గడిపిన సమయం కూడా ఏడాదిలోపే. అయితే అనంతమైన ప్రేమ ఆమె సొంతం. అతని గురించి ఆమె చెబుతుంటే.. ఎదురుగా కూర్చుని వింటున్న నాకు అదేదో నిన్నా మొన్న జరిగినంత ఫ్రెష్‌గా అనిపించింది….అంటూ రీసెంట్‌ టైమ్స్ లో తనను మరింత ఇన్‌స్పయిర్‌ చేసిన ప్రేమకథను పంచుకున్నారు సిల్వర్‌ స్క్రీన్‌ దివా కియారా. అది కూడా సామాన్యుడి ప్రేమ కథ కాదు. కెప్టెన్‌ కా ప్రేమ్‌కహానీ. కార్గిల్‌ యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకున్న కెప్టెన్‌ బాత్రా ప్రేమ కథ.

ఆ కథ తెలుసుకోవాలంటే ముందు షేర్‌షా మూవీ కథ మనకు కొంచెం తెలియాలి. ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలన్న కలతోనే పెరిగారు విక్రమ్‌ బాత్రా. చదువుకునే రోజుల్లో ఆయనకు డింపుల్‌ చీమాతో పరిచయం ఏర్పడింది. వారి ప్రాంతాలు వేరు. సామాజిక వర్గాలు వేరు. ఆమె తండ్రి వారి ప్రేమకు ఒప్పుకోలేదు. ఆమెను జీవితాంతం బాగా చూసుకోవాలన్న కోరికతో తన చిన్ననాటి కలను పక్కనపెట్టి మంచి జీతం వస్తుందని నేవీ వైపు మొగ్గుచూపారు విక్రమ్‌. చిరకాల కలను చంపుకొని బతకాల్సిన అవసరం లేదని, అమ్మాయి అర్థం చేసుకుంటుందని స్నేహితుడు ఇచ్చిన సలహాతో ఆర్మీలోనే చేరారు బాత్రా. కలుపుగోలుతనం, సమయస్ఫూర్తి, సాహసాలను ప్రదర్శించే గుణం అతి తక్కువ కాలంలోనే అతన్ని కెప్టెన్‌గా ప్రమోట్‌ చేసింది. సాటి సైనికులు అతన్ని షేర్‌షా అని పిలవడం మొదలుపెట్టారు. అదే స్ఫూర్తితో అతను కార్గిల్‌ యుద్ధంలోనూ తెగువ చూపించి, గెలుపును కళ్లారా చూసి తుదిశ్వాస వదిలేశారు. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిందే షేర్‌షా సినిమా. ఇందులో సైనికుల సాహసాలు, దేశభక్తి ఎంత గొప్పగా కనిపిస్తుందో, విక్రమ్‌ ప్రేమకథ అంతే క్యూట్‌గా ఉంటుంది.

ఎండ్‌ టైటిల్స్ లో డింపుల్‌ ఇంకా పెళ్లి చేసుకోలేదని ప్రకటించారు మేకర్స్. దాంతో అందరి ఆసక్తి డింపుల్‌ చీమా జీవితం చుట్టూ తిరుగుతోంది. ఆమెను అన్‌సంగ్‌ షీరో అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు. షేర్‌షా సినిమాలో డింపుల్‌ కేరక్టర్‌ ప్లే చేసిన కియారా మరోస్టెప్‌ ముందుకేశారు. డింపుల్‌తో కూర్చుని మాట్లాడుతుంటే… ఆమెలాగా ఇంకెవరైనా ప్రేమించగలరా? అనిపిస్తోందని అన్నారు.

మిసెస్‌ బాత్రా అంటూ విక్రమ్‌ బాత్రా ప్రేమగా పిలుచుకునే డింపుల్‌ గురించి కియారా మాట్లాడుతూ ”షేర్‌షా కథను డైరక్టర్‌ విష్ణు చెప్పినప్పుడు లవ్‌ సీన్స్ విషయంలో సినిమాటిక్‌ లిబర్టీ తీసుకున్నారేమో అనుకున్నా. అయితే నేను డింపుల్‌గారిని చండీఘర్‌లో కలిశాను. ఆమెను కలవడానికి ముందు నా మనసులో చాలా అనుమానాలున్నాయి. అయితే కెప్టెన్‌ బాత్రాతో ఆమెకున్న అనుబంధం గురించి చెప్పడం మొదలుపెట్టాక…. ఇద్దరమ్మాయిలు కలిసి మాట్లాడుకుంటున్నట్టు అనిపించింది. రియల్‌ హీరోస్‌ గురించి పత్రికల్లో, టీవీల్లో చూడటం వేరు. వాళ్ల కుటుంబసభ్యుల ద్వారా, ప్రేమించిన వారి ద్వారా విని తెలుసుకోవడం వేరు.

కెప్టెన్‌ బాత్రా, డింపుల్‌ లవ్‌లో ఉన్నప్పుడు ఇప్పటిలాగా ఫోన్‌ ఫెసిలిటీలు లేవు. ఎప్పుడో ఒక లెటర్‌, ట్రంక్‌ కాల్‌.. అది కూడా కుటుంబసభ్యుల ఆంక్షల మధ్య మాట్లాడుకోవాలి. షేర్‌షాలో మేం చూపించిన లవ్‌ సీన్స్ లో ఎక్కడా అతిశయోక్తి లేదు. వాళ్ల జీవితం అచ్చం అలాగే గడిచింది. కెప్టెన్‌ సార్‌ని ఆమె చివరి చూపు కూడా చూడలేదు. ప్రాణాలతో లేరని తెలిసినా, ఈ జన్మకు ఇక తిరిగి రారని తెలిసినా ఆమె జీవితంలో అతన్ని వదులుకోలేదు. ఇంకొకరి గురించి కనీసం ఆలోచించడం లేదు. అతన్ని ప్రేమించినంతగా ఇంకొకరిని ప్రేమించలేనని గట్టిగా చెబుతున్నారు. ఆయన కూడా ఆమెను అంతే ప్రేమించేవారట.

‘మీ ఫోకస్‌ నా మీద కాదు… డ్యూటీ మీద పెట్టండి’ అని చాలా సార్లు ప్రేమతో కసిరేవారట డింపుల్‌. ఈ మాటల్ని చెబుతున్నప్పుడు డింపుల్‌ కళ్లల్లో ఆనందాన్ని గమనించాను. అంతటి ప్రేమను నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. ముఖ్యంగా చివరిసారి కెప్టెన్‌సార్‌ బస్సెక్కడానికి ముందు ఆయన్ని వదల్లేక… వదల్లేక… వదిలిన క్షణాలను డింపుల్‌ మాటల్లో వింటుంటే నాకు కన్నీళ్లు ఆగలేదు. అంత ధైర్యాన్ని మూటగట్టుకుని, కన్నీళ్లను మింగుతూ చిరునవ్వుతో సైనికులను విధులకు సాగనంపడం మామూలు విషయం కాదు. నాకు ఆ క్షణం సైనికుల భార్యలకు సెల్యూట్‌ చేయాలనిపించింది” అంటూ ఎమోషనల్‌ అయ్యారు కియారా.

(డా. చల్లా భాగ్యలక్ష్మి, టీవీ9, ఈటీ టీమ్)

Also Read: Divi Vadthya : దివి నుంచి దిగివచ్చిన దేవకన్యలా.. అందంతో ఎర వేస్తే ఎలా.. కుర్రాళ్ళ మనసు గిల గిల

Nithiin’s Maestro: గన్ పట్టుకొని కిల్లర్ లేడీగా మారిన మిల్కీ బ్యూటీ.. మాస్ట్రో నుంచి న్యూ పోస్టర్..