Akkineni Family: అక్కినేని కజిన్స్ మొత్తం ఒక్కచోటే.. ఎంతమంది ఉన్నారో తెలుసా.. ? వైరలవుతున్న ఫోటోస్..
అక్కినేని ఫ్యామిలీలో హీరోలుగా వెండితెరపై సందడి చేసినవారు చాలా తక్కువ, నాగేశ్వరరావు, నాగార్జున, సుమంత్, సుశాంత్, నాగచైతన్య, అఖిల్ హీరోలుగా ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు సుమంత్, సుశాంత్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. చైతూ, అఖిల్, నాగార్జున హీరోలుగా తమ సినిమాలతో అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరలవుతుంది.

సినీ పరిశ్రమలో ఉన్న కుటుంబాల్లో అక్కినేని ఫ్యామిలీ ఒకటి. తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేని కుటుంబం. అక్కినేని నాగేశ్వరరావు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన లెగెసీని ఆయన వారసుడు అక్కినేని నాగార్జున ముందుకు నడిపిస్తున్నాడు. నాగ్ తర్వాత నాగచైతన్య, అఖిల్ హీరోలుగా రాణిస్తున్నారు. కేవలం హీరోలుగానే కాకుండా నిర్మాతలుగానూ అక్కినేని కజిన్స్ రాణిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీలో హీరోలుగా వెండితెరపై సందడి చేసినవారు చాలా తక్కువ, నాగేశ్వరరావు, నాగార్జున, సుమంత్, సుశాంత్, నాగచైతన్య, అఖిల్ హీరోలుగా ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు సుమంత్, సుశాంత్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. చైతూ, అఖిల్, నాగార్జున హీరోలుగా తమ సినిమాలతో అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరలవుతుంది.
అందులో అక్కినేని కజిన్స్ అంతా ఒకే చోట కనిపిస్తున్నారు. ఇలా అక్కినేని వారసులు అంతా ఒకే ఫ్రేములో కనిపించడం చాలా అరుదు. ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్న ఫోటోలో నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్, సుప్రియ, మరికొంతమంది కజిన్స్ కనిపిస్తున్నారు. ఉన్నట్లుండి ఇలా అక్కినేని వారసులు అంతా ఒక్కచోట చేసి ఫోటోను షేర్ చేయడం నెట్టింట వైరలవుతుంది. ఈ ఫోటోను అక్కినేని ఫ్యాన్స్ షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని వారసులంతా అటు సినిమాలు.. ఇటు బిజినెస్ లతో బిజీగా ఉన్నారు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నప్పటికీ ఆదివారం అందరూ కలిసి ఫ్యామిలీ కోసం సమయం కేటాయించినట్లుగా తెలుస్తోంది.
గతంలో అక్కి్నేని ఫ్యామిలీ ఫోటో కూడా నెట్టింట వైరలయ్యింది. అందులో అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ దంపతులతోపాటు.. నాగార్జున, అమల దంపతులు ఉన్నారు. వీరితోపాటు నాగ చైతనయ్, అఖిల్ ఉన్నారు. ఆ ఫోటోలో అఖిల్ మూడేళ్లు, చై ఆరేళ్ల వయసు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది నా సామిరంగ సినిమాతో హిట్ అందుకున్నాడు నాగార్జున. ఇక చైతూ తండేల్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
