Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agent: ముందుగా ఓటీటీలోకి వచ్చేసిన ఏజెంట్.. ఎక్కడ చూడొచ్చంటే

అక్కినేని యంగ్ హీరో , హాలీవుడ్‌ హీరోలను తలదన్నే హ్యాండ్సమ్ కుర్రాడు.. ఇవన్నీ ఉన్నా.. అఖిల్‌కు ఇప్పటి వరకు ఒక్క సాలిడ్‌ హిట్‌ పడలేదని చెప్పాలి. మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ పర్లేదు అనిపించినా మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద పరాజాయాన్ని మూటగట్టుకున్నాయి. చివరిగా వచ్చిన ఏజంట్ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.

Agent: ముందుగా ఓటీటీలోకి వచ్చేసిన ఏజెంట్.. ఎక్కడ చూడొచ్చంటే
Agent
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 14, 2025 | 1:28 PM

సినిమా ఇండస్ట్రీలో వరుసగా హిట్స్ వస్తున్నాయ్.. చిన్న సినిమాల నుంచి పెద్ద పెద్ద స్టార్ హీరోల వరకు చాలా మంది హిట్స్ సాధిస్తూ రాణిస్తున్నారు. అయితే అక్కినేని యంగ్ హీరో అఖిల్ మాత్రం చాలా కాలంగా హిట్స్ అందుకోలేకపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినా కూడా సక్సెస్ అందుకోలేకపోయాడు. అఖిల్ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు . వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకొలేకపోతున్నాడు. ఇక చివరిగా అఖిల్ ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై దారుణంగా డిజాస్టర్ అయ్యింది. అయితే నెలలు గడుస్తున్నా ఏజెంట్ సినిమా ఓటీటీలోకి మాత్రం రాలేదు. ఈ సినిమా ఎప్పుడుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులంతా ఎదుచూస్తున్నారు.

సాధారణంగా థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు నెల రోజులకు ఓటీటీలోకి వస్తాయి.. కొన్ని సినిమాలు వారం రోజులకే వస్తాయి.. అని ఏజెంట్ సినిమా మాత్రం ఇంతవరకు ఓటీటీలోకి అడుగు పెట్టలేదు. దానికి కారణం తెలియదు కానీ.. అసలు ఈ సినిమా ఎలా ఉంది .? ఎందుకు అంతలా డిజాస్టర్ అయ్యింది.? అని చూద్దామని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఎట్టకేలకు ఏజెంట్ సినిమా ఓటీటీలోకివచ్చింది

హోలీ సందర్భంగా మార్చ్ 14న అంటే ఈ రోజు నుంచి ఓటీటీలోకి వస్తుందని ప్రకటించారు. కానీ ఊహించని విధంగా నిన్న అంటే 13 సాయంత్రం నుంచే ఏజెంట్ సినిమా సోనీలివ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. సిక్స్ ప్యాక్ బాడీతో అదరగొట్టాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యిన తర్వాత అఖిల్ చాలా కాలం అజ్ఞాతవాసంలో ఉన్నాడు. ఇంతవరకు కొత్త సినిమాను కూడా అనౌన్స్ చేయలేదు. త్వరలోనే అఖిల్ కొత్త సినిమా అనౌన్స్ చేయనున్నాడని టాక్ వినిపిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

స్కూటర్‌ను ఢీకొట్టి..ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్..నిప్పులు చెరుగుతూ
స్కూటర్‌ను ఢీకొట్టి..ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్..నిప్పులు చెరుగుతూ
కేంద్రం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు!
కేంద్రం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు!
గాయని గ్లామర్ ట్రీట్..అందాలతో రచ్చచేస్తున్న స్టార్ సింగర్!
గాయని గ్లామర్ ట్రీట్..అందాలతో రచ్చచేస్తున్న స్టార్ సింగర్!
కటింగ్ చేస్తే లక్షలే..! ఓవర్‌ ఆల్ సంపాదన కోట్లలోనే
కటింగ్ చేస్తే లక్షలే..! ఓవర్‌ ఆల్ సంపాదన కోట్లలోనే
మంచి మనసు చాటుకున్న పవన్ కూతురు !! మురిసిపోయిన రేణు !!
మంచి మనసు చాటుకున్న పవన్ కూతురు !! మురిసిపోయిన రేణు !!
కేంద్రం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు!
కేంద్రం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు!
రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. మెగా అభిమానుల నిర్ణయంపై ప్రశంసలు
రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. మెగా అభిమానుల నిర్ణయంపై ప్రశంసలు
పచ్చి ఉల్లి తినే అలవాటు ఉందా ?? ఇది మీకోసమే !!
పచ్చి ఉల్లి తినే అలవాటు ఉందా ?? ఇది మీకోసమే !!
గ్రహాంతరవాసులు ఉన్నారా ?? ఏలియన్స్ జాడ అమెరికాకు తెలుసా ??
గ్రహాంతరవాసులు ఉన్నారా ?? ఏలియన్స్ జాడ అమెరికాకు తెలుసా ??
ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..తీహార్ జైలు తరలిపునకు రూ. 10 కోట్లు
ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..తీహార్ జైలు తరలిపునకు రూ. 10 కోట్లు