
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో దుమ్మురేపుతోంది. బాలయ్య మూవీ ఫస్ట్ షో చూడాలని అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. రేటుతో సంబంధం లేకుండా ఇప్పటికే చాలా మంది ప్రీమియర్స్ టికెట్స్ బుక్ చేసుకుని థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. ఇక అఖండ 2 థియేటర్స్ దగ్గర అభిమానులు సందడి చేస్తున్నారు.
కడప నగరంలో అఖండా 2 సినిమా రిలీజ్ సందడి. బెనిఫిట్ షో వేయడంతో ధియేటర్ల వద్ద సందడిలచేసిన బాలయ్య అభిమానులు. డ్యాన్సులు వేస్తూ , టపాసులు కాల్చి సంబకాలు చేసుకున్న బాలకృష్ణ అభిమానులు. అన్ని పండగల కంటే బాలయ్య సినిమా రిలీజ్ మాకు పెద్ద పండగ అంటున్నారు అభిమానులు. అఖండా సినిమా కోసం యావత్ భారతదేశం ఎదురు చూస్తుందంటూ అభిమానుల కోలాహలం చేస్తున్నారు ఫాన్స్.
ఇక అఖండ 2 సినిమా విషయానికొస్తే.. హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో పాటు, ఈ చిత్రంలో అద్భుతమైన ఎమోషన్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా కథనాన్ని నడిపించే మనసుని హత్తుకునే మదర్ సెంటిమెంట్ ప్రేక్షకులకు మంచి ఎమోషన్ బాగా కనెక్ట్ అయ్యిందని తెలుస్తుంది. ప్రేక్షకులు బాలకృష్ణను విభిన్న గెటప్‌లలో చూసి పూనకాలతో ఊగిపోతున్నారు. ఇది మరింత ఉత్సాహాన్ని జోడిస్తోంది. ఎస్ థమన్ సంగీతం మరో మెయిన్ హైలైట్, ఇది సినిమా ఎనర్జీ, గ్రాండియర్ ని పెంచేసింది. సంయుక్త కథానాయికగా నటించగా, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.