Ajith Kumar: బాబోయ్.. ఈమె అజిత్ కూతురేనా.. హీరోయిన్స్ ఇక సైడ్ అవ్వాల్సిందే..
ఇప్పటివరకు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఏకైక హీరో. అంతేకాదు.. పర్సనల్ గా మొబైల్ కూడా ఉపయోగించడు. అజిత్ కుటుంబానికి సంబంధించిన ఫోటోస్ నెట్టింట కనిపించడం చాలా అరుదు. ఎప్పుడో ఒకసారి అజిత్ ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట దర్శనమిస్తుంటాయి. కానీ ఇప్పుడు అజిత్ కూతురి ఫోటోస్ మాత్రం నెటింటిని షేక్ చేస్తున్నాయి.

కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోలలో అజిత్ కుమార్ ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని సికింద్రాబాద్ కుర్రోడు తమిళ్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ అజిత్ కు మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు అజిత్ నటించిన చిత్రాలు తెలుగులోకి డబ్ అయి సూపర్ హిట్ అందుకున్నాయి. ఇండస్ట్రీలో స్టార్ హీరో అయినా అజిత్ చాలా ప్రత్యేకం. ఎంతో సింపుల్ గా ఉంటాడు. అలాగే ఇప్పటివరకు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఏకైక హీరో. అంతేకాదు.. పర్సనల్ గా మొబైల్ కూడా ఉపయోగించడు. అజిత్ కుటుంబానికి సంబంధించిన ఫోటోస్ నెట్టింట కనిపించడం చాలా అరుదు. ఎప్పుడో ఒకసారి అజిత్ ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట దర్శనమిస్తుంటాయి. కానీ ఇప్పుడు అజిత్ కూతురి ఫోటోస్ మాత్రం నెటింటిని షేక్ చేస్తున్నాయి.
అజిత్ కూతురు అనౌష్క ఇటీవల తన స్నేహితురాలితో కలిసి ఒక షాపింగ్ మాల్లో కనిపించింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆమె అనుమతి లేకుండానే అనౌష్కను రికార్డ్ చేయడం చేశాడు. ఇది గమనించిన అనౌష్క అసౌకర్యంగా ఫీల్ అవుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనౌష్కకు సంబంధించిన వీడియో నెట్టింట క్షణాల్లో వైరల్ కాగా.. అజిత్ కూతురిని చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు అనౌష్క మరింత అందంగా తయారైందని.. ఇక హీరోయిన్స్ కూడా ఆమె ముందు దిగదుడుపే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం అనౌష్కకు సపోర్ట్చేస్తున్నారు. అనుమతి లేకుండా తన ఫోటోస్, వీడియోస్ తీయడం చాలా తప్పు అని.. ఇతరుల అనుమతి లేకుండా రికార్డ్ చేస్తారా ? అంటూ పైర్ అవుతున్నారు. అయితే అనౌష్కకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా నుంచి డెలిట్ చేయగా.. ఆమె ఫోటోస్ మాత్రం వైరలవుతున్నాయి.
అజిత్ కూతురు ప్రస్తుతం విదేశాల్లోనే చదువుకుంటున్న సంగతి తెలిసిందే. ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అనౌష్క ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలని బావిస్తుందట. త్వరలోనే నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటుందట. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. అజిత్ ప్రస్తుతం అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటిస్తున్నాడు. మరోవైపు అజిత్, త్రిష జంటగా నటిస్తున్న విదాముయార్చి చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నాడు.

Anoushka
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
