Aha : ఆహా కోసం రంగంలోకి అడవి శేష్.. గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ బ్రాండ్ అంబాసిడర్‌గా యంగ్ హీరో

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సూపర్ హిట్ సినిమాలు, ఆకట్టుకునే వెబ్ సిరీస్ లను అందిస్తుంది. వీటితో పాటు అదిరిపోయే గేమ్ షోలు, అలరించే టాక్ షోలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది ఆహా.

Aha : ఆహా కోసం రంగంలోకి అడవి శేష్.. గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ బ్రాండ్ అంబాసిడర్‌గా యంగ్ హీరో
Aha
Follow us

|

Updated on: Oct 29, 2024 | 1:35 PM

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సినిమాలు సిరీస్ లతో పాటు టాక్ షోలు, గేమ్ షోలతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇప్పటికే అన్ స్టాపబుల్ షోలో దూసుకుపోతోన్న ఆహా.. తాజాగా ఓ ఆసక్తికర ప్రకటన చేసింది. టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తమ ప్రీమియం ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారని అనౌన్స్ చేసింది. టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న శేష్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు శేష్. ఇక ఇప్పుడు అడివి శేష్ ఆహా కోసం రంగంలోకి దిగడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : బుర్రపాడవ్వల్సిందే..! రాజారాణిలో కనిపించింది ఈమేనా..! ఇది అస్సలు ఊహించలేదు గురూ..!

ఆహా గోల్డ్, “ఫర్ ది ఫైనెస్ట్” అనే ట్యాగ్‌లైన్‌తో అదిరిపోయే కంటెంట్ ను ప్రేక్షకులకు అందించడానికి. ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారికి లేటెస్ట్ మూవీస్ ముందుగానే చూసేయ్యోచు. అలాగే ప్రీమియం తమిళం, తెలుగు కంటెంట్  లైబ్రరీని అందిస్తుంది. అలాగే ఇది అద్భుతమైన 4K రిజల్యూషన్, డాల్బీ సౌండ్‌తో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Jr.NTR : ఎన్టీఆర్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకున్న నటి సుహాసిని.. ఆసక్తికర విషయం చెప్పిన దర్శకుడు

ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ కు బ్రాండ్ అంబాసిడర్‌ గా వ్యవహరించడం గురించి అడివి శేష్ మాట్లాడుతూ.. “ఆహా గోల్డ్‌లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఆహా OTT ప్లాట్‌ఫారమ్ అభిమానులను అద్భుతమైన కంటెంట్‌తో కనెక్ట్ చేయడమే కాకుండా సినిమా ఇండస్ట్రీని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసే మరపురాని అనుభవాలను కూడా అందిస్తుంది అన్నారు. స్నీక్ పీక్‌లను చూడటం అలాగే సెట్‌లో సెలబ్రెటీలు కలిసే అవకాశం కల్పించడం నిజంగా బాగుంది. ఇది అభిమానులను షూటింగ్ లో పాలుపంచుకోవడానికి అలాగే వారి అభిమాన హీరోలను , హీరోయిన్స్ ను కలుసుకునే అవకాశం కల్పిస్తుంది అని శేష్ అన్నారు. అడివి శేష్ అంబాసిడర్‌గా, ఆహా గోల్డ్ ప్రీమియం వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం కేవలం రూ.899కి సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

View this post on Instagram

A post shared by ahavideoin (@ahavideoin)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.