Alia Bhatt: రోజురోజుకు రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు అలియా భట్ డీప్ ఫేక్ వీడియో
కొన్ని రోజుల క్రితం రష్మిక మందన్న అలాగే బాలీవుడ్ బ్యూటీ కాజోల్ డీప్‌ఫేక్ వీడియోలు వైరల్‌గా మారాయి. ఇప్పుడు నటి అలియా భట్ కూడా డీప్‌ఫేక్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. అలియా భట్ ముఖాన్ని మరో మహిళ శరీరంతో ఎడిట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై అలియా భట్ ఇంకా స్పందించలేదు. ఇలాంటి డీప్‌ఫేక్ వీడియోలు తీసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

టెక్నాలజీని దుర్వినియోగం చేయడం వల్ల ఎన్ని అనర్ధాలు జరుగుతాయో అందరికి తెలిసిన విషయమే.. కానీ కొందరు మాత్రం టెక్నాలజీని వాడి పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటారు. అందువల్ల చాలా మంది హీరోయిన్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజుల క్రితం రష్మిక మందన్న అలాగే బాలీవుడ్ బ్యూటీ కాజోల్ డీప్‌ఫేక్ వీడియోలు వైరల్‌గా మారాయి. ఇప్పుడు నటి అలియా భట్ కూడా డీప్‌ఫేక్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. అలియా భట్ ముఖాన్ని మరో మహిళ శరీరంతో ఎడిట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై అలియా భట్ ఇంకా స్పందించలేదు. ఇలాంటి డీప్‌ఫేక్ వీడియోలు తీసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ సైబర్ నేరగాళ్లు ఇలా వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తున్నారు.
ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియక ముందే జనాలు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో సెలబ్రిటీలు మరింత ఇబ్బందులు పడుతున్నారు. రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో చాలా మందికి ఆగ్రహం తెప్పించింది. కాజోల్ డీప్‌ఫేక్ వీడియో వైరల్ అయినప్పుడు కూడా, నెటిజన్లు సైబర్ నేరగాళ్ల పై ఫైర్ అయ్యారు. ఇప్పుడు అలియా భట్ కూడా డీప్‌ఫేక్ వీడియో వైరల్‌గా మారింది.
రష్మిక మందన్న చాలా హాట్ అవతార్‌లో లిఫ్ట్‌లోకి వస్తున్న డీప్‌ఫేక్ వీడియో క్రియేట్ చేశారు. కాజోల్ కెమెరా ముందు బట్టలు మార్చుకుంటున్న డీప్‌ఫేక్ వీడియో వైరల్‌గా మారింది. రష్మిక యొక్క వీడియో మొదటిసారి వైరల్ అయినప్పుడు, అమితాబ్ బచ్చన్ కూడా ట్వీట్ చేసి, ఇలాంటి పనులు చేసే వారికి తగిన శిక్ష పడాలని అన్నారు. విజయ్ దేవరకొండ, నాగ చైతన్య వంటి ప్రముఖులు కూడా దీన్ని ఖండించారు.
ప్రస్తుతం అలియా భట్ ఫ్యామిలీతో పాటు సినిమాలకూ సమయం కేటాయిస్తోంది. నటిగా మంచి డిమాండ్ ఉండగానే పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటూ అన్నీ మేనేజ్ చేస్తోంది. ఆమె నటించిన ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీంతో అలియా క్రేజ్ పెరిగింది. ‘గంగూబాయి కతియావాడి’ సినిమాలో నటనకుగానూ ‘రాష్ట్ర అవార్డు’ అందుకుంది అలియా. మరి ఈ డీప్ ఫేక్ వీడియో పై ఎలా స్పందిస్తుందో చూడాలి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




