Priyanka Chopra: మరీ ఇంత దారుణమా..! వైరల్ అవుతున్న ప్రియాంక చోప్రా డీప్ ఫేక్ వీడియో
కొంతమంది నెటిజన్స్ హీరోయిన్స్ ను ట్రోల్ చేయడం..వారి పై ఫేక్ వార్తలు, ఫేక్ ఫోటోలు, ఫేక్ వీడియోలు ఎప్పటికప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఈ మధ్య సైబర్ నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. ఒకప్పుడు సెలబ్రెటీల సోషల్ మీడియా అకౌంట్స్ ను హ్యాక్ చేసి అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసే వారు. ఇప్పుడు డీప్ ఫేక్ వీడియోలు చేస్తున్నారు.

డీప్ ఫేక్ వీడియోలు .. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాపిక్ ఇది. సెలబ్రెటీలను ఇబ్బంది పెడుతున్న విషయం ఇది. సోషల్ మీడియా వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో.. అంతే నష్టం కూడా ఉంది. సెలబ్రెటీల వ్యక్తిగత విషయాల ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. కొంతమంది నెటిజన్స్ హీరోయిన్స్ ను ట్రోల్ చేయడం..వారి పై ఫేక్ వార్తలు, ఫేక్ ఫోటోలు, ఫేక్ వీడియోలు ఎప్పటికప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఈ మధ్య సైబర్ నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. ఒకప్పుడు సెలబ్రెటీల సోషల్ మీడియా అకౌంట్స్ ను హ్యాక్ చేసి అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసే వారు. ఇప్పుడు డీప్ ఫేక్ వీడియోలు చేస్తున్నారు. టెక్నాలజీ ఉపయోగించి హీరోయిన్స్ ఫోటోలకు వేరొకరి శరీరాన్ని ఎడిట్ చేసి వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తున్నారు.
ఇప్పటికే రష్మిక మందన్న, కాజోల్, కత్రినా కైఫ్ లాంటి వారి డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ డీప్ ఫేక్ వీడియో కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. చాలా మంది దీనిని ఖండిస్తున్నారు. ఇలాంటివి చేసే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ప్రియాంక చోప్రా డీప్ ఫేక్ వీడియో బయటికోచింది. ప్రియాంక గతంలో మాట్లాడిన ఓ వీడియోను ఉపయోగించి ఆడియో మార్చి సోషల్ మీడియాలో షేర్ చేశారు. నకిలీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు లిప్‌సింక్ చేశారు కేటుగాళ్లు. ఓ బ్యాండ్ కారణంగా తన ఆదాయం పెరిగిందని ఈ వీడియోలో ఉంది. అయితే ఇది ఒరిజినల్ కాదు అని టెక్నాలజీ వాడి కొందరు సైబర్ నేరగాళ్లు ఇలా చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.దీని పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
ప్రియాంక చోప్రా ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




