బ్యాడ్ లక్ హీరో..! 21 సినిమాలు చేస్తే కేవలం రెండు మాత్రం హిట్స్.. కానీ క్రేజ్ మాత్రం ఫుల్
టాలీవుడ్ లో కుర్ర హీరోలు స్పీడ్ పెంచారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. పాన్ ఇండియా సినిమాల హవ నడుస్తుండటంతో.. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కాగా ఓ హీరో మాత్రం ఎంత ప్రయత్నించినా సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు.

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హడావిడి కనిపిస్తుంది. చిన్న సినిమా పేడ్ సినిమా అని తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. కథ బాగుందే చాలు పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నారు. ఇక చిన్న సినిమాలుగా వచ్చిన చాలా మూవీస్ ఇప్పుడు భారీ విజయాలను కూడా అందుకున్నాయి. కొత్త కొత్త దర్శకులతో సినిమాలు చేసి సక్సెస్ అందుకుంటున్నారు. కొంతమంది హీరోలు మాత్రం హిట్స్ కోసం చాలా కష్టపడుతున్నారు.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా కూడా హిట్ అందుకోలేకపోతున్నాడు. ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్నా కూడా సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. ఇంతకూ ఆ యంగ్ హీరో ఎవరో తెలుసా.? ఇప్పటివరకు 21 సినిమాలు చేశాడు ఆ యంగ్ హీరో కానీ రెండే రెండు హిట్స్ అందుకున్నాడు ఆ కుర్ర హీరో.. కానీ క్రేజ్ మాత్రం భారీగానే ఉంది. ఇంతకూ ఆ యంగ్ హీరో ఎవరో కనిపెట్టరా.?
టాలీవుడ్ లో యంగ్ హీరోలకు కొదవే లేదు.. చాలా మంది కుర్ర హీరోలు ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు వారిలో ఆది సాయి కుమార్ ఒకరు. 2011లో “ప్రేమ కావాలి” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆది సాయి కుమార్. ఈ సినిమా విజయం సాధించడంతో ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నూతన నటుడు, సైమా ఉత్తమ నూతన నటుడు అవార్డులు గెలుచుకున్నాడు. ఆ తర్వాత “లవ్లీ” (2012) సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేశాడు. అలాగే, జీ5లో “పులి మేక” వెబ్ సిరీస్‌లో ఫోరెన్సిక్ టీమ్ హెడ్ ప్రభాకర్ శర్మ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు.
ఆది సాయి కుమార్ వరుసగా సినిమాలు చేస్తున్నపటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేశాడు ఆది సాయి కుమార్. అలాగే 2022లో ఏకంగా ఐదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటలేకపోయాయి. ఇక చివరిగా ఆది సాయి కుమార్ షణ్ముఖ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా నిరాశపరిచింది. ఇక ఇప్పుడు శంభల అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ఆది సాయి కుమార్ హిట్ అందుకుంటాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ఏం జరుగుతుందో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








