AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Major : ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్స్ అడవి శేష్ సూపర్ హిట్ మూవీ

ఉగ్రమూకల నుంచి ఎంతో మంది ప్రాణాలను కాపాడి.. వీరత్వం పొందిన వీరుని కథలో మనకు కనిపించారు. మేజర్ ఉన్ని కృష్ణన్‌గా పాన్ ఇండియన్ రేంజ్‌లో అలరించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Major : ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్స్ అడవి శేష్ సూపర్ హిట్ మూవీ
Major
Rajeev Rayala
|

Updated on: Oct 23, 2022 | 7:33 AM

Share

విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసి సక్సెస్ అవుతున్నారు ఇప్పటి యంగ్ హీరోలు.. ఈ కోవలోనే దూసుకుపోతున్నాడు హీరో అడవి శేష్. కెరీర్ బిగినింగ్ నుంచి డిఫరెంట్ కంటెంట్స్ ను ఎంపిక చేసుకుంటున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసిన శేష్.. ఆ తర్వాత హీరోగా మారి మంచి విజయాలను అందుకున్నాడు. క్షణం, గూఢచారి, ఎవరు వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న శేష్. రీసెంట్ గా మేజర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఉగ్రమూకల నుంచి ఎంతో మంది ప్రాణాలను కాపాడి.. వీరత్వం పొందిన వీరుని కథలో మనకు కనిపించారు. మేజర్ ఉన్ని కృష్ణన్‌గా పాన్ ఇండియన్ రేంజ్‌లో అలరించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు శేష్. ఇక ఈ సినిమా థియేటర్స్ లో ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుందో .. ఓటీటీలోనూ అదే రేంజ్ లో  భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శింపబడే సినిమాల జాబితాలో చోటు సంపాదించుకుంది. 53 వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్స్ నవంబర్ 20 నుంచి 28వ తేదీ వరకు ఎంతో ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలో భాగంగా అత్యంత ఆదరణ పొందిన పలు చిత్రాలను ప్రత్యేకంగా ప్రదర్శింపబడతారు.

ఇక ఈ ఫిలిం ఫెస్టివల్ లో మేజర్ సినిమా కూడా ఉండటంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేజర్ మూవీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2022లో ఎంపికైంది అని తెలియజేస్తూహీరో అడివి శేష్, నటి సయీ మంజరేకర్, మహేష్ బాబు, శశికిరణ్ తిక్క, సోనీ పిక్చర్స్ ఇండియాని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి