AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adivi Sesh: చాప కింద నీరులా మిగతా హీరోలకు ఎసరు పెడుతున్న శేష్.. మార్కెట్, స్టేషస్ రెండూ పెరిగాయ్

అడవి శేష్ ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. డబుల్ హ్యాట్రిక్ హిట్స్ అందుకుని తన స్థాయిని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాడు. దీంతో కొందరు హీరోలకి చిక్కొచ్చి పడింది.

Adivi Sesh: చాప కింద నీరులా మిగతా హీరోలకు ఎసరు పెడుతున్న శేష్.. మార్కెట్, స్టేషస్ రెండూ పెరిగాయ్
Actor Adivi Sesh
Ram Naramaneni
|

Updated on: Dec 07, 2022 | 7:16 PM

Share

కమర్షియల్ కథలు కావాలని పేచీ పెట్టడు.. రెగ్యులర్ సినిమాలకు దూరంగా ఉంటాడు.. కొత్త కథలను కమర్షియల్‌గా చెప్పాలనుకుంటాడు.. హీరోయిన్లతో డ్యూయెట్లు అడగడు.. హాలీవుడ్ తరహా మేకింగ్‌తో అదిరిపోయే విజయాలు అందుకుంటున్నాడు.. మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారి నాని, రవితేజ లాంటి స్టార్స్‌కు చెమటలు పట్టిస్తున్నాడు అడవి శేష్.  టాలీవుడ్‌లో సెకండ్ టైర్ హీరోలలో నెంబర్ వన్ ఎవరు అంటే మరో అనుమానం లేకుండా అంతా నిన్నమొన్నటి వరకు నాని పేరు చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడా స్థానం మరో హీరోకు వెళ్లేలా కనిపిస్తుంది. రవితేజ లాంటి సీనియర్ హీరో ఉన్నా.. ఈ మధ్య ఫ్లాపులతో మార్కెట్ తగ్గిపోయింది. నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, రామ్, నితిన్ కూడా అంత ఫామ్‌లో లేరు.

మీడియం రేంజ్ హీరోలంతా వరసగా ఫ్లాపుల్లోనే ఉండటంతో.. అనూహ్యంగా మరో హీరో దూసుకొచ్చారు. చాప కింద నీరులా అందరి స్థానాలకు ఎసరు పెడుతున్నారాయన. అతనెవరో కాదు.. అడివి శేష్. ఈయన సినిమాలో ఉన్నాడంటే బొమ్మ బ్లాక్‌బస్టర్ అని ఫిక్సైపోతున్నారు ఆడియన్స్. నిర్మాతల్లోను అదే నమ్మకం పెంచేసారు శేష్. క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్.. తాజాగా హిట్ 2 సినిమాతో సెకండ్ టైర్ హీరోలలో టాప్ ప్లేస్‌పై కన్నేసారు శేష్.

సరికొత్త మేకింగ్‌తో.. థ్రిల్లింగ్ కథలతో హిట్ మిషన్‌గా మారిపోయారు శేష్. ఈయన దెబ్బకు మిగిలిన వాళ్లకు చెమటలు పడుతున్నాయి. హిట్ 2 మూడ్రోజుల్లోనే 15 కోట్లు షేర్ వసూలు చేసి బ్రేక్ ఈవెన్ అయిపోయింది. మరో రెండు హిట్స్ పడితే ఈ కుర్ర హీరో మార్కెట్ మరింత పెరగడం ఖాయం. నాని, రవితేజ సహా చాలా మంది హీరోల కంటే.. నిర్మాతలకు అడివి శేష్‌పైనే నమ్మకం పెరిగిపోతుంది. అందుకే సెకండ్ టైర్‌లో ఫస్ట్ ఛాయిస్ అవుతున్నారు ఈయన.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.