AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: శుభం సక్సెస్‌ మీట్‌లో ఎమోషనల్ సీన్.. కన్నీళ్లు పెట్టుకున్న అసిస్టెంట్‌ను ఓదార్చిన సమంత.. వీడియో

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె నిర్మాతగా వ్యవహరించిన నటించిన చిత్రం శుభం. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది.

Samantha: శుభం సక్సెస్‌ మీట్‌లో ఎమోషనల్ సీన్.. కన్నీళ్లు పెట్టుకున్న అసిస్టెంట్‌ను ఓదార్చిన సమంత.. వీడియో
Samantha
Basha Shek
|

Updated on: May 16, 2025 | 4:48 PM

Share

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిర్మించిన మొదటి సినిమా శుభం. ఇందులో ఆమె కూడా ఓ కీలక పాత్ర పోషించింది. గరివిరెడ్డి శ్రీనివాస్‌, శాలిని, శ్రియ కొంతం, చరణ్‌ పేరి తదితర యంగ్ యాక్టర్స్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. సినిమా బండి సినిమాతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్‌ కండ్రేగుల ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ హారర్‌ కామెడీ మూవీ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ మూవీ కలెక్షన్లు స్టడీగా కొనసాగుతున్నాయి. శుభం సినిమాకు మంచి కలెక్షన్లు వస్తుండడంతో చిత్ర బృందం శుక్రవారం (మే16) సక్సెస్ మీట్ నిర్వహించింది. హీరోయిన్ సమంతతో సహా శుభం మూవీ టీమ్ అంతా ఈ ఈవెంట్ కు హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

కాగా శుభం సక్సెస్ మీట్ లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈవెంట్‌లో పాల్గొన్న సమంత అసిస్టెంట్‌ ఆర్యన్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న అతను‌ వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది చూసిన సమంత వెంటనే అతని దగ్గరకు వెళ్లి ఓదార్చింది. హృదయానికి హత్తుకుని మరి అసిస్టెంట్‌ను సముదాయించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సమంత గ్రేట్‌ అంటూ కాంప్లిమెంట్స ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అసిస్టెంట్ ను సముదాయిస్తోన్న సమంత.. వీడియో..

సినిమాల సంగతి పక్కన పెడితే..ఈ మధ్యన సమంతపై డేటింగ్‌ రూమర్స్ బాగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్‌ రాజ్ నిడిమోరుతో ఆమె ఫోటోలు షేర్ చేయడంతో మరోసారి దీనిపై చర్చ మొదలైంది. ఈ విషయంపై రాజ్ నిడిమోరు భార్య కూడా స్పందించింది. అయితే ఇవి ఒట్టి రూమర్లేనని సామ్ మేనేజర్ ఖండించారు.

సక్సెస్ టూర్ లో శుభం టీమ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.