Vaishnavi Chaitanya: తెలుగమ్మాయిల గురించి బేబీ నిర్మాత కామెంట్స్.. హీరోయిన్ వైష్ణవి చైతన్య రియాక్షన్ ఇదే..
షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది వైష్ణవి చైతన్య. యూట్యూబ్ లో సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ ద్వారా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. చివరకు బేబీ సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ బ్యూటీ.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.

సినీరంగంలో ఇప్పుడిప్పుడే స్టార్ డమ్ సంపాదించుకుంటున్న తెలుగమ్మాయిలలో వైష్ణవి చైతన్య ఒకరు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. యూట్యూబ్ లో ఫేమస్ అయిన వైష్ణవి.. స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఆ తర్వాత బేబీ సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. ఫస్ట్ మూవీలోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అందులో అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డ సరసన జాక్ చిత్రంలో నటిస్తుంది. తాజాగా ఈ మూవీ నుంచి కిస్ అనే పాటను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నిర్మాత ఎస్కేఎన్ చేసిన కామెంట్స్ పై సైతం స్పందించింది.
కొద్ది రోజుల క్రితం ఓ సినిమా ఈవెంట్లో బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ తెలుగమ్మాయిలను ఇండస్ట్రీలో ప్రోత్సహిస్తే ఏం అవుతుందో బాగా తెలిసిందని అన్నారు. దీంతో ఆ వ్యాఖ్యలు వైష్ణవి చైతన్యను ఉద్దేశించి చేసినవే అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ మరుసటి రోజే ఓ వీడియో రిలీజ్ చేస్తూ.. ఇప్పటికే తాను ఆరుగురు తెలుగమ్మాయిలను ఇండస్ట్రీలోకి తీసుకువచ్చానని.. మరో 25 మందిని కూడా పరిచయం చేస్తానని అన్నారు. దీంతో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. తాజాగా ఇదే విషయంపై వైష్ణవి చైతన్యకు సైతం ప్రశ్న ఎదురైంది.
ఈ సందర్భంగా వైష్ణవి చైతన్య మాట్లాడుతూ..”ఎస్కేఎన్ తో నాకు ఇబ్బంది ఉందని ఎవరు చెప్పారు. ఆయనతో నాకు ఎలాంటి సమస్యలు లేవు. ఆయన చేసిన కామెంట్స్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ వివాదంపై ఆయన ఓ వీడియో సైతం రిలీజ్ చేశారు. అందులో నా పేరు మెన్షన్ చేయనప్పుడు నేనెందుకు స్పందిస్తాను” అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఎస్కేఎన్ బ్యానర్ లో చేయాల్సిన సినిమా ఆగిపోవడం గురించి స్పందిస్తూ.. బేబీ టీమ్ తో చేయాల్సిన సినిమా కొన్ని కారణాలతో ఆగిపోయిందని.. మళ్లీ ఛాన్స్ వస్తే కచ్చితంగా చేస్తానని చెప్పుకొచ్చింది.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..