Paiyya Movie: ఆ హీరోయిన్ అనుకుంటే తమన్నా వచ్చింది.. ఆవారా సినిమాను మిస్సైన బ్యూటీ ఎవరంటే..
సాధారణంగా సినిమా మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ అందులోని సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇండస్ట్రీలో పలు సినిమాలు ప్రేక్షకులకు ఆకట్టుకున్న ఈ సినిమాలోని పాటలు మాత్రం మెస్మరైజ్ చేశాయి. అందులో ఆవారా ఒకటి. కోలీవుడ్ హీరో కార్తీ నటించిన ఈ సినిమా గురించి చెప్పక్కర్లేదు.

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో పయ్యా ఒకటి. తమిళంలో డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో ఆవారా పేరుతో రిలీజ్ చేశారు. యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ గా వచ్చిన ఈ సినిమాలో కార్తీ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది. ఈ సినిమాకు తమిళంతోపాటు తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ యూట్యూబ్ లో అత్యధిక మిలియన్ వ్యూస్ అందుకుంటూ దూసుకుపోతున్నాయి. ఈ సినిమా వస్తే ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు జనాలు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అదెంటంటే.. ఈ సినిమాకు కథానాయికగా తమన్నా కంటే ముందు మరో స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేశారట. కానీ కొన్ని కారణాలతో ఆమె స్థానంలోకి మిల్కీ బ్యూటీ వచ్చిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు డైరెక్టర్ లింగుస్వామి.
పయ్యా సినిమాలో తమన్నా, కార్తీ జోడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. కానీ ఆమె కంటే ముందు ఈ సినిమా కోసం నయనతారను ఎంపిక చేసుకున్నారట. కథ విని ఆమె కూడా ఓకే అన్నారని.. కొన్ని విషయాల్లో ఆమెతో తనకు సరిపడలేదని.. దీంతో సినిమా షూటింగ్ కంటే ముందు అనివార్య కారణాలతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారని.. ఆమె స్థానంలోకి తమన్నాను తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ సినిమా చేస్తున్న సమయంలో తమన్నా వయసు కేవలం 19 ఏళ్లు మాత్రమే అన్నారు. ఈ సినిమా కోసం తమన్నా ఎంతో కష్టపడిందని చెప్పుకొచ్చారు.
పయ్యా సినిమా ఎక్కువగా ట్రావెలింగ్ లోనే ఉంటుందని.. దీంతో నటీనటులకు కారవాన్ లు ఏర్పాటు చేయడానికి వీలు కాలేదని.. దీంతో తమ ఇబ్బందిని అర్థం చేసుకుందని.. ఆమె కారులోనే కాస్ట్యూమ్స్ మార్చుకుందని.. ఆ సమయంలో కారు చుట్టూ చీరలు అడ్డుగా పట్టుకుని ఉండేవాళ్లని.. వృత్తి పట్ల ఆమెకు ఉన్న నిబద్ధత చూసి ఆశ్చర్యపోయానని.. తను తప్పకుండా స్టార్ అవుతుందని ఊహించినట్లు తెలిపారు డైరెక్టర్ లింగుస్వామి.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..