Mahesh Babu: మహేష్ నాకు కాలేజ్ డేస్ నుంచే పరిచయం.. అప్పట్లో అంటూ అసలు విషయం బయట పెట్టిన త్రిష

గుంటూరు కారం సినిమా నిరాశపరచడంతో ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ రాజమౌళి సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ గా నిలిచిన సినిమాల్లో అతడు సినిమా ఒకటి. మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో పెద్దగాఆకట్టుకోలేకపోయింది.

Mahesh Babu: మహేష్ నాకు కాలేజ్ డేస్ నుంచే పరిచయం.. అప్పట్లో అంటూ అసలు విషయం బయట పెట్టిన త్రిష
Mahesh Babu , Trisha
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 19, 2024 | 4:27 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ లెవల్ లో ఉండనుంది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కంటే ముందు వచ్చిన గుంటూరు కారం సినిమా నిరాశపరచడంతో ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ రాజమౌళి సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ గా నిలిచిన సినిమాల్లో అతడు సినిమా ఒకటి. మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో పెద్దగాఆకట్టుకోలేకపోయింది. కానీ బుల్లి తెరపై ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమాలో త్రిష, మహేష్  మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్.. ఎవరో తెలుసా.?

బావ ప్రేమకోసం ఎదురుచూసే పల్లెటూరి అమ్మాయిగా త్రిష అద్భుతంగా నటించి మెప్పించింది. ఇక ఈ సినిమా తర్వాత త్రిష మహేష్ బాబు కలిసి సైనికుడు సినిమా చేశారు. కానీ ఈ సినిమా కూడా నిరాశ పరిచింది. ఆ తర్వాత త్రిష, మహేష్ బాబు కలిసి నటించలేదు. ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి త్రిష మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.  మహేష్ బాబు తన ఫెవరెట్ హీరోల్లో ఒకరు అని చెప్పింది. అలాగే మహేష్ బాబు సెట్ లో చాలా సరదాగా ఉంటాడు. అలాగే చాలా హార్డ్ వర్క్ చేస్తాడు.

ఇది కూడా చదవండి :డీ గ్లామర్ లుక్‌లో ఉన్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా..? ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమె..

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా చాలా గౌరవిస్తాడు. అసలు కారవాన్ లోకి కూడా వెళ్లడు. తన షూటింగ్ అయిపోయినా కూడా .. మానిటర్ దగ్గర కూర్చొని అన్ని గమనిస్తూ ఉంటాడు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మహేష్ బాబు నాకు చాలా కాలం నుంచి తెలుసు. మేము ఇద్దరం కాలేజ్ డేస్‌లో చెన్నైలో ఉన్నాము. మా ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉండేవారు. వారి వల్ల మహేష్ తో పరిచయం ఏర్పడింది. ఆ టైం లో మేము యాక్టర్స్ అవుతామని అనుకోలేదు. అప్పుడు హాయ్, బాయ్ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉండేది. ఇప్పుడు మహేష్ నా ఫెవరెట్ హీరోల్లో ఒకడు అని త్రిష చెప్పుకొచ్చింది. ఇక త్రిష చాలా కాలం తర్వాత తెలుగులో నటిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో ఆమె నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక మహేష్ రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మహేష్ లుక్ మొత్తం మార్చేశాడు. లాంగ్ హెయిర్ గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు మహేష్. ఈ సినిమా ఆఫ్రికన్ అడావుల నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు గరుడ, గోల్డ్ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారట.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Tollywood : రోడ్డు పై డాన్స్‌తో అదరగొట్టిన టాలీవుడ్ హీరోయిన్.. కారణం తెలిస్తే శబాష్ అనాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.