Tollywood: రూ.5000లతో ఇండియాకు వచ్చింది.. అవకాశాల పేరుతో మోసపోయి.. చివరకు.. ఇండస్ట్రీ సెన్సేషన్..

సినీరంగంలో ఇప్పుడు ఆమె మోస్ట్ పాపులర్ హీరోయిన్. ముఖ్యంగా స్పెషల్ పాటలకు ఆమె కేరాఫ్ అడ్రస్. మూడు నిమిషాల పాటకు ఏకంగా రూ.5 కోట్లు వసూలు చేసే హీరోయిన్. కానీ ఆమె ఒకప్పుడు రూ.5000లతో ఇండియాకు వచ్చి ఆఫర్స్ కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..

Tollywood: రూ.5000లతో ఇండియాకు వచ్చింది.. అవకాశాల పేరుతో మోసపోయి.. చివరకు.. ఇండస్ట్రీ సెన్సేషన్..
Nora Fatehi

Updated on: Feb 06, 2025 | 2:30 PM

బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి గురించి చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా కేవలం 5000లతో ముంబై చేరుకుని అవకాశాల కోసం ప్రయత్నించింది. కెరీర్ తొలినాళ్లల్లో ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కోని.. తన ప్రతిభతో మెప్పించింది. సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ద్వారా చాలా పాపులర్ అయ్యింది. తెలుగులోనూ పలు చిత్రాల్లోనూ స్పెషల్ సాంగ్స్ చేసి అలరించింది. అయితే ఈ హీరోయిన్ కెరీర్ తొలినాళ్లలో ఎన్నో అవమానాలు, విమర్శలు ఎదుర్కొంది. అనేకసార్లు అవకాశాల పేరుతో మోసపోయింది. సినిమాల్లో ఛాన్స్ అని చెప్పి.. చివరకు ఆ ఆఫర్ మరో అమ్మాయికి ఇచ్చి మోసం చేశారు మేకర్స్. అలాగే బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొంది. రూ.5000లతో ముంబై వచ్చి.. అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది.

సినీరంగంలో నటిగా వెలగాలని ఎన్నో ఆశలలతో చేతిలో రూ.5000లతో ముంబై చేరుకుంది. ఆమె ఇండో మొరాకో కెనడియన్. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తొమ్మిది మంది మానసిక రోగులు ఉన్న రోడ్డుపై బస చేసింది. బ్రెడ్స్, గుడ్లు తింటూ బ్రతికింది. కానీ ఇప్పుడు పాన్ ఇండియా సెన్సేషన్ అయ్యింది. ఇటీవల విడుదలైన తన సినిమా మడ్గావ్ ఎక్స్‌ప్రెస్ విజయంలో మునిగిపోయిన నోరా ఫతేహి, మషబుల్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకుంది.

ఇవి కూడా చదవండి

“నేను మూడు BHK అపార్ట్‌మెంట్‌లో తొమ్మిది మంది మానసిక రోగులతో నివసించాను, అక్కడ నేను మరో ఇద్దరు అమ్మాయిలతో కలిసి గదిని పంచుకున్నాను. ఆ సమయంలో ఎన్నో బాధలు భరించాను. సినిమాల్లో ఆఫర్స్ కోసం తక్కువ పారితోషికం తీసుకోవడానికి రెడీ అయ్యాను. కొన్నిరోజులకు కేవలం గుడ్లు, బ్రెడ్స్ మాత్రమే తింటూ బతికాను. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాను. అనేక అడిషన్స్ ఇచ్చాను. కానీ సినిమాలో ఛాన్స్ అని చెప్పి.. ఆ తర్వాత నా స్థానంలోకి మరో అమ్మాయిని తీసుకున్నారు. ఎన్నో అవమానాలు, తిరస్కరణలు, బాధాకరమైన అనుభవాలను ఎదుర్కొన్నాను ” అంటూ చెప్పుకొచ్చింది.

ఆ తర్వాత సినిమాల్లో ఆఫర్స్ అందుకుని అందం, అభినయంతో మెప్పించింది. దిల్బర్ పాటతో నోరా ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. దీంతో ఆమెకు హిందీలో వరుస ఆఫర్స్ వచ్చాయి. నోరా ఫతేహి ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ ద్వారా అలరించింది.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన