AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంతకన్నా విషాదం మరొకటి ఉండదు.. పుట్టిన రోజే చనిపోయిన నటి

ఈ మధ్య చాలా మంది సినీ సెలబ్రెటీలు కూడా హార్ట్ స్ట్రోక్ తో చనిపోయి అభిమానులను, సినీ ఇండస్ట్రీని విషాదంలో నెట్టేశారు. తాజాగా ఓ నటి బర్త్ డే రోజునే కన్నుమూసింది. దాంతో అభిమానులు అందరూ విషాదంలో మునిగిపోయారు. అంతే కాదు చనిపోతానని ముందే స్నేహితుల దగ్గర చెప్పిందంట ఆ నటి. అలాగే ఉన్నట్టుండి ఓ ప్రమాదంలో ఆ నటి చనిపోయింది. 

ఇంతకన్నా విషాదం మరొకటి ఉండదు.. పుట్టిన రోజే చనిపోయిన నటి
Actress
Rajeev Rayala
|

Updated on: Apr 06, 2024 | 9:18 AM

Share

మనిషి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం.. చావు ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పడం చాలా కష్టం.. ఈ మధ్యకాలంలో చాలా మంది సడన్ గా చనిపోయారు. హార్ట్ స్ట్రోక్ తో కొంతమంది ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. ఈ మధ్య చాలా మంది సినీ సెలబ్రెటీలు కూడా హార్ట్ స్ట్రోక్ తో చనిపోయి అభిమానులను, సినీ ఇండస్ట్రీని విషాదంలో నెట్టేశారు. తాజాగా ఓ నటి బర్త్ డే రోజునే కన్నుమూసింది. దాంతో అభిమానులు అందరూ విషాదంలో మునిగిపోయారు. అంతే కాదు చనిపోతానని ముందే స్నేహితుల దగ్గర చెప్పిందంట ఆ నటి. అలాగే ఉన్నట్టుండి ఓ ప్రమాదంలో ఆ నటి చనిపోయింది.

బాల నటిగా పలు సినిమాల్లో నటించి మెప్పించింది తరుణి సచ్ దేవ్. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అలాగే పా అనే సినిమాలో అమితాబ్ బచ్చన్ తో నటించింది. ఈ సినిమాలో అమితాబ్ ఫ్రెండ్ గా నటించింది ఈ బ్యూటీ. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి మోడలింగ్ లోకి అడుగుపెట్టింది.. దాదాపు 50 యాడ్స్ లో నటించింది ఈ చిన్నది. అయితే అనూహ్యంగా చిన్న తనంలో చనిపోయింది తరుణి సచ్ దేవ్.

15వ ఏట ఓ విమాన ప్రమాదంలో చనిపోయింది తరుణి సచ్ దేవ్. అదే రోజు తన పుట్టిన రోజు కావడంతో మరింత విషాదం.తరుణి సచ్ దేవ్ మే 14 1998న జన్మించింది. మే 14 2012లో విమాన ప్రమాదంలో కన్నుమూసింది ఈ చిన్నది. చనిపోయే నాటికి ఆమె వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే.. ఆమె పుట్టిన రోజు చివరి రోజుఅయ్యింది. అయితే తాను చనిపోయే ముందు స్నేహితులతో తన చావు గురించి చెప్పిందట. బర్త్ డే నాడు తన తల్లితో పాటు పిక్నిక్ కు వెళ్ళింది తరుణి. బర్త్ డే నాడు తల్లితో కలిసి నేపాల్ కు బయలుదేరింది ఈ చిన్నది. దానికి ముందు రోజు స్నేహితులతో ఇదే తాను చివరిసారి కలవడం అని చెప్పిందట తరుణి. అది విని తన స్నేహితులు షాక్ అయ్యారట.. ఎప్పుడు లా మాట్లాడని తరుణి అలా చెప్పడంతో షాక్ అయ్యారట అంతా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us