
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కల్కి 2898 ఏడీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు రాజా సాబ్ సినిమాలో నటిస్తున్నారు. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. హారర్ కామెడీ డ్రామా వస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ప్రభాస్ తన కెరీర్ లో మొదటిసారి హారర్ కామెడీ జానర్ చేస్తుండడంతో ఈ సినిమా కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు ప్యాన్స్. అయితే ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.
తాజాగా రాజాసాబ్ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని టాక్ వినిపిస్తుంది. దీంతో ఇందులో కనిపించబోయే హీరోయిన్ ఎవరా ? అనే చర్చ నడుస్తుంది. ఈక్రమంలోనే చాలా మంది హీరోయిన్స్ పేర్లు బయటకు వచ్చాయి. రాజాసాబ్ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ తారల పేర్లు వినిపించాయి. తాజాగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం టాలీవుడ్ తోపు హీరోయిన్ పేరు వినిపిస్తుంది. ఆమె మరెవరో కాదు.. మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ ఇదివరకే తమన్నాతో చర్చలు జరిపారని సమాచారం. అయితే ఇందులో నిజం ఎంతవరకు ఉందనేది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. తమన్నా, ప్రభాస్ కలిసి గతంలో మూడు సినిమాల్లో నటించారు. రెబల్, బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాల్లో వీరిద్దరు జంటగా నటించారు. ఇక ఇప్పుడు ప్రభాస్ సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తుందని టాక్ రావడంతో మరోసారి వీరిద్దరి కాంబోపై ఆసక్తి ఏర్పడింది. రాజాసాబ్ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..