
సుహాసిని.. ఒకానొక సమయంలో హీరోయిన్ గా ఎన్నో విభిన్న సినిమాల్లో నటించి మెప్పించారు. 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజి బిజీగా ఉంటున్నారు. తెలుగులోనే కాదు ఇతర దక్షిణాది భాషల్లోనూ నటిగా బిజీగా ఉంటున్నారు సుహాసిని. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓ స్టార్ హీరో గురించి సుహాసిని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ స్టార్ హీరోను మొదటిగా చూసినప్పుడు అతను విలన్ అనుకున్నాను కానీ ఆయనే హీరో అని తెలిపారు సుహాసిని. ఇంతకూ ఆ హీరో ఎవరంటే..
ఆయన ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి.. కెరీర్ ప్రారంభంలో తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం కాళీ షూటింగ్‌లో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సమయంలో చిరంజీవిని మొదటిసారి కలిశానని సుహాసిని గుర్తుచేసుకున్నారు. అప్పుడు కొత్తగా పెళ్లైన చిరంజీవి ఎవరితోనూ మాట్లాడకుండా ఒక మూలన కూర్చునే వారు అని తెలిపారు. కాగా నటి సుమలతతో కలిసి ఒక తమిళ చిత్రంలో నటిస్తున్నప్పుడు, సుమలత నన్ను “నువ్వు చిరంజీవితో యాక్ట్ చేస్తున్నావట? అని అడిగితే, సుహాసిని అవును అయితే ఏంటి.?అని అడిగారట. అప్పుడు సుమలత ఆయన తెలుగులో కమల్ హాసన్ లాంటి పెద్ద హీరో అవుతారు అనగానే, “అయ్యో, చూడడానికి విలన్ లా ఉన్నారే” అని సుహాసిని అన్నారట.
సుమలత ఆ మాటను చిరంజీవికి చెప్పడంతో, మరుసటి రోజు చిరంజీవి “విలన్ ఫేస్‌తో ఎవరు యాక్ట్ చేస్తారు?” అని సరదాగా ఏడిపించారు అని సుహాసిని అన్నారు. తాను ఎంత సారీ చెప్పినా ఆయన మన్నించలేదని, చివరికి మిత్రులయ్యారని సుహాసిని నవ్వూతూ వివరించారు. ఇక సుహాసిని, చిరంజీవిది సూపర్ హిట్ కాంబినేషన్.. ఈ ఇద్దరూ కలిసి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.