Sneha Prasanna: భర్తతో విభేదాలు.. విడాకులు తీసుకోబోతున్న స్నేహ ?.. వైరలవుతున్న హీరోయిన్ ఇన్‏స్టా పోస్ట్..

|

Nov 13, 2022 | 7:35 AM

కొద్ది రోజులుగా స్నేహ తన భర్తతో విడిపోయిందని.. ప్రస్తుతం ఒంటరిగా ఉంటుందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి.

Sneha Prasanna: భర్తతో విభేదాలు.. విడాకులు తీసుకోబోతున్న స్నేహ ?.. వైరలవుతున్న హీరోయిన్ ఇన్‏స్టా పోస్ట్..
Sneha Family
Follow us on

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు స్నేహ. అందం, అభినయంతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది. గ్లామర్ పాత్రలు కాకుండా హోమ్లీ పాత్రలను ఎంచుకుంటూ ఫ్యామిలీ ఆడియన్స్ మనసు దొచుకుంది. దివంగత హీరోయిన్ సౌందర్య తర్వాత ఆ స్థాయిలో తెలుగు సినీ ప్రియుల మదిని దొచుకుంది స్నేహ. రాధ గోపాలం.. శ్రీరామదాసు.. వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ్ భాషలలో నటిస్తూ కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే హీరో ప్రసన్న కుమార్ ను 2011లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి బాబు, పాప ఉన్నారు. పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న స్నేహ.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ.. అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాల్లో కీలకపాత్రలలో నటించి మెప్పించింది. అయితే కొద్ది రోజులుగా స్నేహ తన భర్తతో విడిపోయిందని.. ప్రస్తుతం ఒంటరిగా ఉంటుందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి.

వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని.. త్వరలోనే వీరు విడాకులు కూడా తీసుకోబోతున్నట్లుగా వార్తలు వినిపించాయి. అయితే తమ బంధం గురించి వస్తున్న రూమర్స్ పై ఎట్టకేలకు హీరోయిన్ స్నేహ స్పందించింది. తన భర్త ప్రసన్న చెంపపై ముద్దు పెడుతూ ఓ సెల్ఫీ తీసి మరీ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దానికి ట్వినింగ్ వీకెండ్ అంటూ రాసుకొచ్చింది. దీంతో విడాకుల గురించి వస్తున్న వార్తలకు ఒక్క ఫోటోతో చెక్ పెట్టేసింది స్నేహ.

ఇవి కూడా చదవండి

Sneha

స్నేహ.. ప్రసన్న జంటగా 2009లో అచ్చముందు అనే సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇరువురి కుటుంబసభ్యుల సమక్షంలో 2011లో మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మరోవైపు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది స్నేహ. ఎప్పటికప్పుడు తన కుటుంబానికి సంబంధించిన ఫోటోస్ అప్లోడ్ చేస్తుంటుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.