బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయింది.. కట్ చేస్తే మూడు రోజులు ఇంట్లో అదే పని.. ఓపెన్‌గా చెప్పిన హీరోయిన్
చాలా మంది హీరోయిన్స్ నటనకు ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. అలాగే ఛాలెంజింగ్ రోల్స్ లో నటిస్తూ సత్తా చూపిస్తున్నారు. అలాగే తమ అందంతోనూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. అలాగే కొంతమంది పై ఆరోపణలు కూడా వస్తుంటాయి. ఇంతకూ ఆమె ఎవరంటే..

చాలా మంది హీరోయిన్స్ నటనకు ప్రాధాన్యత పాత్రలను ఎంచుకుంటూ మంచి పేరును సొంతం చేసుకుంటున్నారు. డీగ్లామర్ లుక్ అయినా సరే అంటూ సినిమాలు చేస్తున్నారు. కొంతమంది తమ అద్భుత నటనతో అవార్డులు కూడా సొంతం చేసుకుంటున్నారు. అలాగే బోల్డ్ పాత్రల్లో నటించడానికి కొంతమంది ముద్దుగుమ్మలు సై అంటుంటే మరికొంతమంది మాత్రం నై అంటున్నారు. కానీ ఈ అమ్మడు మాత్రం బోల్డ్ గా నటించడమే కాదు అంతకు మించి కూడా చేస్తా అని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. సినిమా కోసం బికినీలో నైనా నటిస్తా లేదంటే మరో అడుగు కూడా ముందుకు వేసి నగ్నంగానూ నటిస్తా అని తెలిపింది ఆ ముద్దుగుమ్మ. దాంతో ఆమె పై కొందరు ఆరోపణలు చేశారు. కేసులు కూడా పెట్టారు. ఇంతకు ఆ హాట్ బ్యూటీ ఎవరో తెలుసా..? ఆమె మలయాళ ముద్దుగుమ్మ శ్వేతా మీనన్.
ఏం సినిమా రా బాబు.! భయంతో వాంతులు చేసుకోవడం ఖాయం.. ఎక్కడ చూడొచ్చంటే
గతంలో వచ్చిన రతి నిర్వేదం అనే బోల్డ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. 2011లో వచ్చిన ఈ మలయాళ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. శృంగార నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా తర్వాత శ్వేతా మీనన్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఈ సినిమాలో హాట్ హాట్ అందాలతో అదరగొట్టింది శ్వేతా మీనన్. ఈ ముద్దుగుమ్మ అందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. గతంలో అడల్ట్ చిత్రాల్లో నటిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని ఆమె పై ఆరోపణలు వచ్చాయి. మార్టిన్ అనే వ్యక్తి శ్వేత మీనన్ పై ఫిర్యాదు చేశాడు. గతంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. డబ్బుల కోసం ఎలాంటి సినిమాలైనా చేస్తా అని ఆమె చెప్పిందని మార్టిన్ తెలిపాడు. ఫిర్యాదు చేసినా కూడా పోలీస్లు పట్టించుకోవడం లేదని అతను కోర్టును ఆశ్రయించినట్లు తెలిపాడు. తాజాగా ఈ అమ్మడు అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అధ్యక్షురాలిగా విజయం సాధించింది.
లక్ అంటే ఈ బ్యూటీదే.. స్టార్ హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న క్రేజీ హీరోయిన్.. 11ఏళ్ల తర్వాత ఇలా..
తాజాగా ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది.. తన కెరీర్, జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి శ్వేతా మీనన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్వేతా మీనన్ మాట్లాడుతూ.. నా కూతురికి నేను ఎలాంటి ఆస్తులు కూడబెట్టలేదు.. మంచి ఆరోగ్యం, చక్కటి చదువు ఇవ్వగలిగితే చాలు. కానీ అప్పుడప్పుడూ విహారయాత్రలకు తీసుకెళ్తున్నా. కొన్నిసార్లు మేం నివసించే ఫ్లాట్‌ని నా కూతురు తనదేనని అంటుంది. కానీ 5 పైసలు కూడా ఆమెకు ఇవ్వను అని చెప్పుకొచ్చింది. తల్లిదండ్రులపై ఆధారపడకుండా తను ఎదగాలన్నదే నా పిల్లలకు ఇవ్వాలన్నది నా లక్ష్యం. పిల్లలు పెరిగి పెద్దయ్యే వరకు వాళ్లకు అన్నీ సమకూర్చి ఇవ్వకూడదని శ్వేత మీనన్ చెప్పుకొచ్చింది. అలాగే 12 ఏళ్ల క్రితం నాటి సినిమాపై ఇలా కేసులు పెట్టడం సరికాదు అంటూ తనపై వచ్చిన ఆరోపణల గురించి మాట్లాడింది శ్వేతామీనన్. ఆ సినిమాలు నాకు గుర్తింపును, అవార్డులను తెచ్చిపెట్టాయి. నా పై కేసులు పెట్టడం, ఆరోపణలు చేయడంతో మూడు రోజుల పాటు ఇంట్లోనే ఏడుస్తూ కూర్చొన్నా. కానీ నా కుటుంబం నన్ను నడిపించింది. ఆ సమయంలో అందరికంటే ఎక్కువగా బాధపడింది నా కూతురి గురించే అని శ్వేతా మీనన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
రోజూ రాత్రి అలా చేయకపోతే నాకు నిద్రపట్టదు.. ఫిజికల్ టచ్ ఉండాల్సిందే అంటున్న బ్యూటీ
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




