
తిరుమలలో నటి శ్రియా తళుక్కుమంది. శ్రీవారి దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకుంది. తల్లి కూతురుతో కలిసి బుధవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో శ్రియా పాల్గొంది. కుమార్తె రాధ శరణ్ ను ఎత్తుకుని తల్లి నీరజ తో కలిసి శ్రీవారిని సేవించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం పొందిన శ్రియ ఆలయం ముందు భక్తులను ఆకర్షించింది.
ఇవి కూడా చదవండి : Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పటికీ సినిమాల్లో బిజీ.. 52 ఏళ్ల వయసులో ఒంటరిగా..
శ్రీవారికి రూ. కోటి విరాళం..
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. తమిళనాడులోని ఈ రోడ్డుకు చెందిన భక్తురాలు రూ. కోటి విరాళాన్ని టీటీడీకి అందజేసింది. ఈరోడ్ కు చెందిన సౌమ్య తిరుమలలో అదనపు ఈఓ వెంకయ్య చౌదరిని కలిసి రూ. కోటి విరాళం డిడి ని అందజేసింది. ఇందులో రూ. 50 లక్షలు ఎస్ వి ప్రాణదానం ట్రస్టుకు, మరో రూ. 50 లక్షలు ఎస్వీ అన్నదానం ట్రస్ట్ కు వినియోగించాలని సౌమ్య కోరింది.
టీటీడీకి రెండు కార్లు డోనేట్..
తిరుమల శ్రీవారికి రెండు కార్లను భక్తులు డొనేట్ చేశారు. చెన్నై కి చెందిన లోటస్ ఆటో వర్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన భక్తులు రూ. 10 లక్షల విలువైన ఎలక్ట్రిక్ కారును టిటిడి అధికారులకు అందజేశారు. అదేవిధంగా చెన్నైకు చెందిన శరవనన్ కరుణాకరన్ అనే భక్తుడు రూ.9 లక్షలు విలువైన సిట్రాయెన్ (బసాల్ట్ ఎక్స్ ప్లస్ యంటీ) కారును విరాళంగా అందించారు. ఈ మేరకు దాతలు శ్రీవారి ఆలయం ముందు కార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ పేష్కార్ రామకృష్ణకు తాళాలు అందించారు.
ఇవి కూడా చదవండి : Serial Actress : షూటింగ్ కోసం వెళ్తే అసభ్యకరమైన ఫోటో చూపించిన పెద్ద హీరో.. సీరియల్ బ్యూటీ సంచలన కామెంట్స్..
ఇవి కూడా చదవండి : Bigg Boss : నా బట్టలు నా ఇష్టం.. నాకు నచ్చినట్లు నేనుంటా.. బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..