Seerat Kapoor: ‘అల్లు అర్జున్ ప్రాపర్టీ’ అంటూ నెటిజన్ చీప్ కామెంట్స్.. ఇచ్చి పడేసిన టాలీవుడ్ హీరోయిన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , హీరోయిన్ సీరత్ కపూర్ పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల బన్నీ బర్త్‌డే సందర్భంగా సీరత్ కపూర్ బన్నీతో కలిసి దిగిన కొన్ని ఫొటోలు షేర్ చేయగా నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఇదే అదునుగా కొందరు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు.

సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై నెగెటివ్ కామెంట్స్ చేయడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. కొందరు ఆకతాయిలైతే హీరోయిన్ల విషయంలో మరీ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. వారిని అసభ్యకరంగా దూషిస్తూ ట్రోల్ చేస్తున్నారు. కొందరు వీటిని చూసీ చూడనట్టు వదిలేస్తే మరికొందరు మాత్రం తమను ట్రోల్ చేసిన వారికి అంతే గట్టిగా బుద్ధి చెబుతుంటారు. తాజాగా రన్ రాజా హీరోయిన్ సీరత్ కపూర్ అదే జరిగింది. తనను అసభ్యకరంగా దూషించిన ఓ నెటిజన్ కు తన దైన శైలిలో ఇచ్చిపడేసిందీ అందాల తార. వివరాల్లోకి వెళితే.. అల్లు అర్జున్ పుట్టిన రోజు న సీరత్ కపూర్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ప్రైవేట్ జెట్ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫొటోలో బన్నీతో సీరత్ కపూర్ క్లోజ్ గా ఉండడం చూసి కొందరు నెటిజన్లు రెచ్చిపోయారు. అసభ్యకరమైన కామెంట్లు చేశారు. ఒక నెటిజన్ ఏకంగా సీరత్ కపూర్ ను ‘అల్లు అర్జున్ ప్రాపర్టీ’ అని సంబోధించడంతో వివాదాస్పదమైంది.
ఇది గమనించిన సీరత్ కపూర్ సైలెంట్ గా ఉండలేకపోయింది. వెంటనే సదరు నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ‘హార్ట్ ఎమోజీలు పెట్టినంత మాత్రాన ఆ కామెంట్ గౌరవప్రదం మారిపోదు. ఒక మహిళ ఎవరికీ ఆస్తి కాదు. ఆమెకు తనకంటూ సొంత కలలు, గొంతు, గుర్తింపు ఉంటాయి. ఎవరినైనా అభిమానించేటప్పుడు గౌరవంతో ఉండండి.. కానీ సొంతం భావించొద్దు’అని కౌంటర్ ఇచ్చిందీ అందాల తార. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. సీరత్ కపూర్ కు అందరూ మద్దతు పలుకుతున్నారు.
అల్లు అర్జున్ తో సీరత్ కపూర్..
View this post on Instagram
సీరత్ కపూర్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. రన్ రాజా రన్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించిందీ అందాల తార. ఆ తర్వాత కొలంబస్, రాజు గారి గది 2, ఒక్క క్షణం, టచ్ చేసి చూడు, కృష్ణ అండ్ హిజ్ లీల, మనమే వంటి సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయింది. ‘సేవ్ ది టైగర్స్’ వంటి వెబ్ సిరీస్ లతో ఓటీటీ ఆడియెన్స్ ను కూడా మెప్పించిందీ అందాల తార. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ‘జాతస్య మరణం ధ్రువం’, ‘ది బ్లాక్ గోల్డ్’ తదితర సినిమాలు ఉన్నాయి.
రాజమౌళితో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




