AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: ఫుట్‌వేర్‌ తయారీ బిజినెస్‌ ఇంత సింపుల్‌గా స్టార్ట్‌ చేయొచ్చా? నెలకు లక్షల్లో ఆదాయం!

మన దేశంలో ఫ్యాషన్, ఆన్‌లైన్ షాపింగ్ పెరగడంతో ఫుట్‌వేర్ తయారీ వ్యాపారానికి మంచి భవిష్యత్తు ఉంది. రూ. 3-10 లక్షల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించి, నాణ్యత, సరికొత్త డిజైన్లతో 20-40% లాభాలు పొందవచ్చు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, సరైన వ్యూహంతో ఈ వ్యాపారంలో మంచి వృద్ధి సాధించవచ్చు.

Business Idea: ఫుట్‌వేర్‌ తయారీ బిజినెస్‌ ఇంత సింపుల్‌గా స్టార్ట్‌ చేయొచ్చా? నెలకు లక్షల్లో ఆదాయం!
Footwear Manufacturing
SN Pasha
|

Updated on: May 13, 2026 | 6:30 AM

Share

మన దేశంలో ఫ్యాషన్‌, ఆన్‌లైన్‌ షాపింగ్‌, బ్రాండెడ్‌ ఉత్పత్తుల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఫుట్‌వేర్ తయారీ వ్యాపారానికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. చెప్పులు, షూస్‌, సాండల్స్‌, స్పోర్ట్స్‌ ఫుట్‌వేర్‌ వంటి ఉత్పత్తులకు నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిమాండ్‌ పెరుగుతోంది. సరైన ప్రణాళికతో ప్రారంభిస్తే ఈ వ్యాపారం లాభదాయకంగా మారే అవకాశం ఉందని వ్యాపార నిపుణులు చెబుతున్నారు. చిన్న స్థాయిలో ఫుట్‌వేర్ తయారీ యూనిట్‌ను ప్రారంభించాలంటే సాధారణంగా రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. యంత్రాలు, ముడి పదార్థాలు, అద్దె షెడ్‌, కార్మికుల ఖర్చులు, విద్యుత్‌, ప్యాకేజింగ్‌ వంటి అంశాలపై పెట్టుబడి ఆధారపడి ఉంటుంది.

పెద్ద స్థాయిలో ఆటోమేటెడ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలంటే పెట్టుబడి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వ్యాపారంలో ప్రధానంగా సోల్స్‌, లెదర్‌, రబ్బర్‌, ఫోమ్‌, ఫ్యాబ్రిక్‌ వంటి ముడి పదార్థాలు అవసరం అవుతాయి. కట్టింగ్‌ మెషిన్లు, స్టిచింగ్‌ మెషిన్లు, ఫినిషింగ్‌ పరికరాలు కీలక పాత్ర పోషిస్తాయి. మొదట స్థానిక మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని తక్కువ డిజైన్లతో ప్రారంభించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బిజినెస్‌ విజయానికి నాణ్యత, ట్రెండీ డిజైన్లు, సరైన ధరలు కీలకం. ప్రస్తుతం సోషల్‌ మీడియా, ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫారమ్‌లు చిన్న బ్రాండ్లకు కూడా పెద్ద మార్కెట్‌ను అందిస్తున్నాయి.

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్‌ వేదికల ద్వారా విక్రయాలు పెంచుకోవచ్చు. స్కూల్‌ షూస్‌, మహిళల ఫ్యాన్సీ ఫుట్‌వేర్‌, స్పోర్ట్స్‌ షూస్‌ వంటి ప్రత్యేక విభాగాలపై దృష్టి పెడితే మంచి ఆదరణ లభించే అవకాశం ఉంటుంది. లాభాల విషయానికి వస్తే సరైన మార్కెటింగ్‌, ఉత్పత్తి నాణ్యత ఉంటే 20 నుంచి 40 శాతం వరకు మార్జిన్‌ పొందే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే ముడి పదార్థాల ధరల పెరుగుదల, పెద్ద బ్రాండ్ల పోటీ, ఫ్యాషన్‌ ట్రెండ్ల మార్పులు వంటి అంశాలు సవాళ్లుగా మారవచ్చు. అయినా సరైన వ్యూహం, కస్టమర్‌ నమ్మకం, నాణ్యమైన ఉత్పత్తులతో ఫుట్‌వేర్ తయారీ వ్యాపారం దీర్ఘకాలంలో మంచి లాభాలు అందించే రంగంగా నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
గుట్టలపై దాగిన 400 ఏళ్ల రహస్యం!
గుట్టలపై దాగిన 400 ఏళ్ల రహస్యం!
రెప్ప పాటులో లాక్కెళ్లిన రాకాసి అలలు.. వాళ్లే గనుక లేకుంటే...!
రెప్ప పాటులో లాక్కెళ్లిన రాకాసి అలలు.. వాళ్లే గనుక లేకుంటే...!
స్పూన్ తింటే నడవలేని వాళ్ళు కూడా రేసు గుర్రంలా ఉరుకులు పెడతారు
స్పూన్ తింటే నడవలేని వాళ్ళు కూడా రేసు గుర్రంలా ఉరుకులు పెడతారు
అప్పుడు ఎత్తుకుని పెంచాం.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు..
అప్పుడు ఎత్తుకుని పెంచాం.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు..
ఇంటి గోడలపై పగుళ్లు వస్తున్నాయా? ఈ తప్పులు చేయకపోతే మీ భవనం పదిలం
ఇంటి గోడలపై పగుళ్లు వస్తున్నాయా? ఈ తప్పులు చేయకపోతే మీ భవనం పదిలం
హిమాలయాల్లో భారత ఆర్మీ సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్!
హిమాలయాల్లో భారత ఆర్మీ సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్!
సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో జర్నీ చేసిన టీమిండియా దిగ్గజం..!
సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో జర్నీ చేసిన టీమిండియా దిగ్గజం..!
వర్షాకాలంలో గులాబీలు పూలతో కళకళలాడాలంటే.. సింపుల్ టిప్స్ పాటిస్తే
వర్షాకాలంలో గులాబీలు పూలతో కళకళలాడాలంటే.. సింపుల్ టిప్స్ పాటిస్తే
అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
రోజుకో రంగు మారే వింత పువ్వు.. నిన్న, నేడు, రేపు మొక్కను ఇంట్లోనే
రోజుకో రంగు మారే వింత పువ్వు.. నిన్న, నేడు, రేపు మొక్కను ఇంట్లోనే