Folk Song: జబర్దస్త్ నూకరాజు ఆడి పాడిన పాట.. ఆసియా అద్దిరిపోయే డ్యాన్స్.. యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న సాంగ్
ఇప్పుడు సినిమా పాటలతో పాటు ఫోక్ సాంగ్స్ కు, ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ కు స్పెషల్ క్రేజ్ ఉంది .ముఖ్యంగా తెలంగాణ పల్లె పాటలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సాంగ్స్ కు యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి

జబరస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో నూకరాజు ఒకరు. ‘పటాస్’ షో లో స్టాండప్ కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన అతను తక్కువ సమయంలోనే మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక జబర్దస్త్ షో తో మరింత క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కేవలం కమెడియన్ గానే కాకుండా రైటర్ గానూ, సింగర్ గానూ సత్తా చాటుతున్నాడు నూకరాజు. జబర్దస్త్ లో అద్దిరిపోయే స్కిట్స్ రాసే అతను పాటలు కూడా రాస్తున్నాడు. వాటిని లయబద్ధంగా ఆలపిస్తున్నాడు. ఇక పటాస్ షో చేస్తున్న సమయంలోనే నూకరాజుకు ఆసియా పరిచయమైంది. బుల్లితెరపై వీరి జోడికి మంచి క్రేజ్, పాపులారిటీ ఉంది. టీవీ వేదికలపై వీరు చేసే కామెడీ స్కిట్స్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే నూకరాజు, ఆసియా రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే వీరిద్దరూ కలిసి ఎన్నో యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తూ అలరిస్తున్నారు. అలా ఈ లవ్ బర్డ్స్ కలిసి నటించిన ఓ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబడుతూ రికార్డులు బద్దలు కొడుతోంది.
కేవలం యూట్యూబ్ లోనే కాదు ఇన్ స్టా గ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, వాట్సప్ స్టేటసుల్లోనూ ఈ పాటనే ఎక్కువగా వినిపిస్తోఇంది. అన్నట్లు ఈ పాటను నూకరాజు స్వయంగా పాడడం విశేషం. ఇక డ్యాన్స్ కూడా కుమ్మేశాడీ జబర్దస్త్ కమెడియన్. అతనికి తోడుగా ఆసియా కూడా ఎంతో అందంగా కనిపించింది. అలాగే ఎనర్జిటిక్ డ్యాన్స్ తో సాంగ్ కు మరింత ఊపు తెచ్చింది. బావ మరదల్లు సరదాగా పాడుకున్నట్లుగా సాగే ఈ పాటకు ఇప్పటివరకు సుమారు 4.9 కోట్ల వ్యూస్ వచ్చాయి.
ఇంతకీ ఆ సాంగ్ ఏదనుకుంటున్నారా? ‘గుట్టకింద గుంపు చెట్ల కింద సాంగ్ ’ అనే లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఎందుకంటే ప్రస్తుతం నూకరాజు, ఆసియా ప్రస్తుతం మ్యాడ్ ఫర్ ఈజ్ అదర్ ప్రోగ్రామ్ లో కంటెస్టెంట్లుగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ లో ఈ జంట ఇదే పాటకు డైరెక్టర్ అనిల్ రావిపూడి ముందు డ్యాన్స్ చేసి మెప్పించారు. నూకరాజు, ఆసియాల డ్యాన్స్ చూసి మెచ్చుకున్న అనిల్ రావిపూడి కూడా డ్యాన్స్ వేయడం విశేషం. అంతేకాదు.. ఈ పాట నూకరాజు తానే స్వయంగా పాడాను అని చెప్పడంతో భవిష్యత్తులో ఏదో ఒక సినిమాలో పాట పాడే అవకాశం ఇస్తాను అని చెప్పడం వివేషం. మొత్తానికి మ్యాడ్ ఫర్ ఈజ్ అదర్ షో తర్వాత.. ‘గుట్టకింద గుంపు చెట్ల కింద సాంగ్ ’ పాటకు వ్యూస్ మరింత పెరగడం గమనార్హం.
జబర్దస్త్ నూకరాజు, ఆసియాల ఫోక్ సాంగ్.. వీడియో ఇదిగో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




