AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: స్టార్ హీరోయిన్ సంస్కారానికి నెటిజన్లు ఫిదా.. చిరంజీవికి షూ తొడిగిన టాలీవుడ్ అందాల తార.. వీడియో

సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఐ బ్యాంక్ తో పాటు బ్లడ్ బ్యాంకులు నిర్వహిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. వీటి ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారాయన. ఆయనపై ఉన్న అభిమానంతో తరచూ ఎంతో మంది మెగా అభిమానులు రక్తదానం చేస్తూనే ఉన్నారు

Chiranjeevi: స్టార్ హీరోయిన్ సంస్కారానికి నెటిజన్లు ఫిదా.. చిరంజీవికి షూ తొడిగిన టాలీవుడ్ అందాల తార.. వీడియో
Chiranjeevi
Basha Shek
|

Updated on: Aug 06, 2025 | 8:20 PM

Share

గచ్చిబౌలి హైటెక్ సిటీ ఫీనిక్స్ ఈక్వినాక్స్‌లో బుధవారం (ఆగస్ట్ 06) మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. చుక్కపల్లి శంకర్ రావు స్మారకంగా అలాగే 79 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే హనుమాన్ హీరో తేజ సజ్జాతో పాటు పలువురు సినీ ప్రముఖులు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదానం అవశ్యకతను, తాను బ్లడ్ బ్యాంక్ పెట్టడానికి గల కారణాల్ని చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే ఈ సందర్భంగా ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో భాగంగా జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిరంజీవి కూడా తన షూ పక్కకు విప్పేసి ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పక్కకు వెళ్లి మళ్లీ తన షూ వేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఈ సమయంలో కాస్త ఇబ్బంది పడ్డారు. దీనిని చిరంజీవి చుట్టూ ఉన్న వారందరూ గమనించారు. వెంటనే ఆయనకు షూ తొడిగేందుకు ముందుకొచ్చారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సంయుక్త మేనన్ కూడా మెగాస్టార్ షూ తొడిగేందుకు ప్రయత్నించింది. కానీ చిరంజీవి మాత్రం వద్దని వారించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. చిరంజీవి పట్ల సంయుక్త చూపిన సంస్కారం పట్ల సినీ అభిమానులు, నెటిజనులు ఫిదా అవుతున్నారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది సంయుక్త. ఆ తర్వాత బింబిసారతో సూపర్ హిట్ కొట్టింది. విరూపాక్షతో వంద కోట్ల సినిమాను ఖాతాలో వేసుకుంది. సార్ సినిమాతోనూ హిట్ కొట్టిన ఈ మలయాళ బ్యూటీ తెలుగులో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పాన్ ఇండియా మూవీ స్వయంభులో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా నటిస్తోన్న చిత్రంలోనూ కథానాయికగా ఎంపికైంది. ఇక బాలకృష్ణ అఖండ 2 లోనూ సంయుక్త మేనన్ ఒక కీలక పాత్ర పోషిస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

బ్లడ్ డొనేషన్ క్యాంపులో చిరంజీవి, తేజ సజ్జా, సంయుక్త మేనన్..

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి