హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన హీరోయిన్.. చిన్న గ్యాప్ ఇచ్చి.. ఇప్పుడు వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఒకటి, రెండు సినిమాలతో పాపులర్ అయ్యి అవకాశాలు అందుకుంటున్నారు. తక్కువ సినిమాలే అయినా క్రేజ్ తెచ్చుకున్న భామలు చాలా మంది ఉన్నారు. ఇక ఇప్పుడు మనం చూస్తున్న ఈ హీరోయిన్ మాత్రం ఆచితూచి సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటుంది.

చాలా మంది హీరోయిన్స్ వచ్చిన అవకాశాలను వదలకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోతున్నారు. మరికొంతమంది ఆచితూచి సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్నారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటుంది. చేసిన సినిమాలన్నీ వరుసగా విజయాలను అందుకున్నాయి. సినిమా సినిమాకు గ్యాప్ ఇస్తూ మంచి హిట్స్ అందుకుంటుంది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వరుసగా మూడు సినిమాలు హిట్ అయ్యాయి. తెలుగు, తమిళ్ లోనూ సినిమాలు చేసింది. ఆతర్వాత కొంతకాలం గ్యాప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆమె ఎవరో తెలుసా.?
సంయుక్త మీనన్ 2016లో మలయాళ చిత్రం ‘పాప్‌కార్న్’తో హీరోయిన్‌గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది, ఈ చిత్రంలో షైన్ టామ్ చాకో సరసన నటించింది. 2018లో తమిళ చిత్రం ‘కలరి’తో తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టింది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ మొదటి చిత్రం ‘భీమ్లా నాయక్’ , ఈ సినిమాలో రానా దగ్గుబాటి భార్య పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత ‘బింబిసార’, ‘సార్’, ‘విరూపాక్ష’ వంటి తెలుగు చిత్రాల్లో నటించి విజయాలు సాధించింది.
ప్రస్తుతం సంయుక్త నిఖిల్ సిద్ధార్థ సరసన ‘స్వయంభూ’, కళ్యాణ్ రామ్ సరసన ‘బింబిసార 2’, సినిమాల్లో నటిస్తుంది. అలాగే ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలోనూ కనిపించనుంది. అలాగే, మెగాస్టార్ చిరంజీవితో ఒక ప్రాజెక్ట్‌లో కూడా పనిచేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. అలాగే బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2లోనూ నటిస్తుంది. వీటితో పాటు ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో ఈ అమ్మడు ఛాన్స్ అందుకుంది తెలుస్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న సినిమాలో కూడా సంయుక్త ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తుంది.
సంయుక్త మీనన్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..