Tollywood: ’20 ఏళ్లుగా మోశావ్! ఇప్పుడు నేను’.. తల్లిని భుజానకెత్తుకుని మెట్లు దింపిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో
ఇంటర్నేషనల్ మదర్స్ డే (మాతృ దినోత్సవం) సందర్భంగా అందరూ తమ తల్లులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ మాతృమూర్తులతో తమకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక టాలీవుడ్ హీరోయిన్ తన తల్లికి వినూత్నంగా మదర్స్ డే విషెస్ చెప్పింది.

మాతృదినోత్సవం సందర్భంగా సామాన్యులతో సెలబ్రిటీలు తమ తల్లులకు శుభాకాంక్షలు తెలిపారు. చాలా మంది తమ తల్లులకు బహమతులు అందించి వారిపట్ల తమ కృతజ్ఞతా భావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా తమ తల్లులతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుని మురిసిపోయారు. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఈ క్రమంలో మదర్స్ డే సందర్భంగా ఒక టాలీవుడ్ హీరోయిన్ తన తల్లికి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపింది. ‘నాకు అన్ని రోజులు మదర్స్ డే’ నే అంటూ తన తల్లిని భుజానకెత్తుకుని మెట్లు దింపింది. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘ నవ మాసాలు మోసింది.. 20 ఏళ్లకు పైగా నన్ను ఎమోషనల్‌గా మోస్తూనే ఉంది.. అందుకే నేను ఇప్పుడు అమ్మను ఇలా మోస్తున్నాను.. ఇది కచ్చితంగా మా అమ్మకి నచ్చుతుంది.. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి అంటూ ప్రతీ రోజూ మదర్స్ డే’ అని అమ్మపై తనకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చిందీ అందాల తార. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. దీనిని చూసిన వారందరూ సదరు హీరోయిన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘సో క్యూట్.. మీ తల్లీ కూతుళ్లు అనుబంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలి’ అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇలా మదర్స్ డే రోజున అందరి మన్ననలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు నిఖిల్ కిరాక్ పార్టీ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించిన సంయుక్తా హెగ్డే. ఇందులో తన అందం, అభినయంతో ఆకట్టుకుందీ కన్నడ ముద్దుగుమ్మ. అయితే కిరాక్ పార్టీ తర్వాత నేరుగా మరే తెలుగు సినిమాలోనూ సంయుక్త నటించలేదు. అయితే అప్పుడప్పుడు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ముందుకు వస్తోంది.
వీడియో ఇదిగో..
View this post on Instagram
ప్రస్తుతం కన్నడ, తమిళ సినిమాలతో బిజి బిజీగా ఉంటోంది సంయుక్త. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోది. తరచూ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేస్తుంటుంది. అలాగే తన బ్యూటిఫుల్ పిక్స్ ను షేర్ చేసుకుంటుంది. వీటికి నెటిజన్లు నుంచి మంచి స్పందన వస్తుంటుంది.
తల్లితో సంయుక్తా హెగ్డే..
View this post on Instagram