Samantha: ‘దయచేసి చిన్నచూపు చూడకండి’.. మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన నటి సమంత..
తెలంగాణ మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో సుధీర్ఘ నోట్ షేర్ చేశారు. తన వ్యక్తిగత విషయం గురించి మాట్లాడటం మానేయాలని అన్నారు.
తెలంగాణ మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో సుధీర్ఘ నోట్ షేర్ చేశారు. తన వ్యక్తిగత విషయం గురించి మాట్లాడటం మానేయాలని అన్నారు. స్త్రీగా ఉండేందుకు.. బయటకు వచ్చి నిలబడి పోరాడేందుకు చాలా ధైర్యం కావాలని.. ఈ ప్రయాణం తనను మార్చిందుకు గర్వపడుతున్నానని అన్నారు. ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా ఉండాలని అన్నారు.
“నా విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవా లని నేను అభ్యర్థిస్తున్నాను. స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి.. చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారూ, ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను. దయచేసి చిన్నచూపు చూడకండి. ఒక మంత్రిగా మీ మాటలకు వాల్యూ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాను. వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయి. ఎటువంటి రాజకీయ కుట్ర ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచగలరా ? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను. అలానే ఉండాలని కోరుకుంటున్నాను…సమంత” అంటూ ఇన్ స్టాలో స్టోరీ పోస్ట్ చేసింది సమంత.
Samantha
కొండ సురేఖ కామెంట్స్..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుతో సినీరంగంలోని పలువురు ఇబ్బంది పడ్డారని తెలంగాణ మంత్రి కొండ సురేఖ అన్నారు. కొందరు హీరోయిన్స్ త్వరగా పెళ్లి చేసుకుని ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ అని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మత్తు పదార్థాలకు అలవాటు పడి.. సినీ పరిశ్రమకు చెందిన కొందరిని వాటికి అలవాటు చేశారని.. రేవ్ పార్టీలో చేయడంతోపాటు.. సినీతారలను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. అలాగే అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి కూడా కేటీఆర్ కారణమని అన్నారు. కొండ సురేఖ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. కొండ సురేఖ చేసిన వ్యా్ఖ్యలపై సినీ రాజకీయ ప్రముఖులు మండిపడుతున్నారు. అక్కినేని నాగార్జున, నటుడు ప్రకాష్ రాజ్, సింగర్ చిన్మయి, కోన వెంకట్ తదితరులు కొండ సురేఖ చేసిన కామెంట్స్ పై సీరియస్ అయ్యారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.