Tollywood: హీరోయిన్ గజాల ఎలా ఉందో చూశారా.? ఇప్పుడు అందాలతో హార్ట్ ఎటాకే

హీరోయిన్ గజాల మీకు గుర్తుందా.? 'నాలో ఉన్న ప్రేమ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అందాల భామ.. ఆ తర్వాత ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమాతో టాప్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది.

Tollywood: హీరోయిన్ గజాల ఎలా ఉందో చూశారా.? ఇప్పుడు అందాలతో హార్ట్ ఎటాకే
Gajala
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 02, 2024 | 8:47 PM

హీరోయిన్ గజాల మీకు గుర్తుందా.? ‘నాలో ఉన్న ప్రేమ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అందాల భామ.. ఆ తర్వాత ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమాతో టాప్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది. ‘ఓ చినదాన’ ‘జానకి వెడ్స్ శ్రీరామ్’ ‘మల్లీశ్వరి’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది ఈ వయ్యారి. ఆ సమయంలో ఎన్టీఆర్, తరుణ్, ఉదయ్ కిరణ్ లాంటి స్టార్ హీరోలతో నటించిన ఈ భామకు.. ఎక్కడా సక్సెస్ కలిసిరాలేదు. ఏమాత్రం స్టార్ స్టేటస్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు ఫైజల్ రజా ఖాన్‌ను వివాహం చేసుకుని సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది.

ఇది చదవండి: ఏయ్ బంటీ నీ సబ్బు స్లోనా ఏంటి? ఈ పాప గుర్తుందా.. ఇప్పుడు నడుమందాలతో

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. 2022, జూలై 22న హీరోయిన్ గజాల ఎవ్వరూ ఊహించని విధంగా నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. కానీ ఆమె సహా నటులు సరైన సమయానికి హాస్పిటల్‌కు తీసుకెళ్లడంతో.. బ్రతికి బయటపడింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం అస్సలు బయటకు రాలేదు. అయితే గతంలో గజాల, హీరో ఆదిత్య ఓంతో డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఇక వీరిద్దరి బ్రేకప్ వల్లే.. గజాల ఇలా ఆత్మహత్యకు పాల్పడిందని.. ఆ సమయంలో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ప్రస్తుతం గజాల ఓ ప్రొడక్షన్ కంపెనీ నడుపుతోంది. హిందీ చిత్రాలు, ప్రైవేటు ఆల్బం సాంగ్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో గజాల యాక్టివ్‌గా ఉంటోంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇది చదవండి: ఒకప్పటి స్టార్ కమెడియన్.. ఇప్పుడు ఇలా మారిపోయిందేంటి.. ఎవరో తెల్సా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి