AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: నువ్వు ఒక వారియర్.. నీకోసం ప్రార్థిస్తుంటాను.. వైరలవుతున్న సమంత పోస్ట్..

కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న సామ్.. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. తన సొంత నిర్మాణ సంస్థ బ్యానర్ పై మా ఇంటి బంగారం అనే చిత్రంలో నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ పోస్టర్ ఆసక్తిని కలిగించగా.. ఆ తర్వాత ఎలాంటి వివరాలు అనౌన్స్ చేయలేదు. అలాగే మలయాళంలో సూపర్ స్టార్ మమ్ముట్టి చిత్రంలో సామ్ నటించనుందని టాక్ వినిపిస్తుంది. కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Samantha: నువ్వు ఒక వారియర్.. నీకోసం ప్రార్థిస్తుంటాను.. వైరలవుతున్న సమంత పోస్ట్..
Samantha
Rajitha Chanti
|

Updated on: Jul 02, 2024 | 3:52 PM

Share

అతి తక్కువ సమయంలోనే దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్ సమంత. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సామ్.. గత కొన్నాళ్లుగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు ఈ సమస్యకు చికిత్స తీసుకుంటూనే మరోవైపు కొన్ని సినిమాల్లో నటించింది. కానీ విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమా తర్వాత ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న సామ్.. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. తన సొంత నిర్మాణ సంస్థ బ్యానర్ పై మా ఇంటి బంగారం అనే చిత్రంలో నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ పోస్టర్ ఆసక్తిని కలిగించగా.. ఆ తర్వాత ఎలాంటి వివరాలు అనౌన్స్ చేయలేదు. అలాగే మలయాళంలో సూపర్ స్టార్ మమ్ముట్టి చిత్రంలో సామ్ నటించనుందని టాక్ వినిపిస్తుంది. కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే.. సినిమాల్లో సైలెంట్ అయినా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‏గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హెల్త్ అప్డేట్స్ ఇస్తూ.. అలాగే కొన్ని పోస్టులు కూడా పెడుతుంది.

తాజాగా బాలీవుడ్ బుల్లితెర నటి హీనా ఖాన్‏ కోసం ఆసక్తికర పోస్ట్ చేసింది. హీనా ఖాన్ ప్రస్తుతం క్యాన్సర్ తో పోరాడుతున్న సంగతి తెలిసిందే. తనకు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ 3వ దశలో ఉందంటూ ఇటీవల సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇక ఇతాజాగా తాను కీమోథెరపీ సెషన్ కోసం ఆసుపత్రిలో ఉన్నట్లు ఓ ఫోటో షేర్ చేసింది. ఇక హీనా ఖాన్ పోస్టుకు సమంత రియాక్ట్ అవుతూ “నీ కోసం నేను ప్రార్థిస్తున్నాను. నువ్వు యోధురాలివి” అంటూ ఇన్ స్టా స్టోరీలో హీనాకు ధైర్యం చెప్పింది.

Samantha, Hina Khan

Samantha, Hina Khan

ఇక సమంత పోస్టుకు హీనా ఖాన్ స్పందిస్తూ.. “ఒకరిని తీసుకున్నాకే మరొకటి తెలుసుకోవడం జరుగుతుంది. మీరు నిజమైన స్టార్ అని నాకు తెలుసు. ఎందుకంటే జీవితంలో ఎదురైన అడ్డంకులను మీరు ఎదుర్కొన్న విధానం అద్భుతమైనది. మీరు చాలా ప్రేమ, ఆశీర్వాదాలు ” అంటూ రాసుకొచ్చింది. హే రిష్తా క్యా కేహలతా హై సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత పలు సీరియల్స్, సినిమాల్లో నటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.