Darshan: ‘పిచ్చి అంటారు సార్ దీన్ని’.. ఏడాది బిడ్డకు దర్శన్‌లా ఖైదీ వేషం వేయించిన అభిమాని.. ఫొటోషూట్ కూడా

అభిమాని హత్య చేయించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం జైళ్లో గడుపుతున్నాడు కన్నడ స్టార్ హీరో దర్శన్. ప్రస్తుతం ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. మరోవైపు దర్శన్ ఉంటోన్న జైలుకు అతని అభిమానుల హడావిడి ఎక్కువైంది. దర్శన్ జైలులో చేరినప్పటి నుంచి చాలా మంది జైలు ముంగిట గూమిగూడి ఆందోళనలు చేస్తున్నారు

Darshan: 'పిచ్చి అంటారు సార్ దీన్ని'.. ఏడాది బిడ్డకు దర్శన్‌లా ఖైదీ వేషం వేయించిన అభిమాని.. ఫొటోషూట్ కూడా
Darshan
Follow us

|

Updated on: Jul 02, 2024 | 3:51 PM

అభిమాని హత్య చేయించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం జైళ్లో గడుపుతున్నాడు కన్నడ స్టార్ హీరో దర్శన్. ప్రస్తుతం ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. మరోవైపు దర్శన్ ఉంటోన్న జైలుకు అతని అభిమానుల హడావిడి ఎక్కువైంది. దర్శన్ జైలులో చేరినప్పటి నుంచి చాలా మంది జైలు ముంగిట గూమిగూడి ఆందోళనలు చేస్తున్నారు. దర్శన్ ను కోర్టుకు తీసుకెళ్తుండగా.. షూటింగ్ జరుగుతోందంటూ అభిమానులు ‘డి బాస్’ అంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో దర్శన్ పై తమ ప్రేమను రకరకాలుగా చాటుకుంటున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో ఒక అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. దర్శన్ పై ఉన్న అభిమానంతో కుమారుడికి ఏకంగా ఖైదీ డ్రెస్ తొడిగించి ఫొటో షూట్ చేయించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ‘బ్రాండ్ ఆఫ్ శాండల్‌హుడ్ డి బాస్ ఫ్యాన్స్ మైసూర్’ అనే సోషల్ మీడియా ఖాతా లో ఈ పిల్లాడి ఫొటోను షేర్ చేశారు. ఇందులో ఏడాది వయసున్న చిన్నారిని ఖైదీ వేషధారణలో ముస్తాబు చేశారు. దర్శన్‌కు ఇచ్చిన అండర్ ట్రయల్ ఖైదీ నంబర్‌ 6106నే చిన్నారి డ్రెస్ పై కూడా వేయించారు. పిల్లాడి పక్కన ‘జై డి బాస్’, ఖైదీ నంబర్ 6106 అంటూ అక్షరాలు కూడా ఏర్పాటుచేశారు.

ఈ ఫొటోను చూసిన దర్శన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సామాన్యులు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. ఖైదీ వేషధారణలో చిన్నారి ఫొటో తీయడం దారుణమంటూ సదరు అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నెట్టింట విస్తృతంగా చర్చ జరుగుతోంది. ‘ఇలా చేయడం అభిమానం అనిపించుకోదు.. పిచ్చి అంటారు దీన్ని’ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఖైదీ వేషధారణలో ఏడాది బాలుడు.. ఫొటోస్ ఇదిగో..

కాగా నటుడిపై ఉన్న పిచ్చి ప్రేమ కోసం అభిమానులు ప్రతిరోజూ ట్రెండ్ అవుతున్నారు. కొందరు దర్శన్ అండర్ ట్రైయల్ ఖైదీ నంబర్ ను టాటూలుగా వేయించుకున్నారు.

6106 నంబర్ ను పచ్చ బొట్టుగా వేయించుకుంటోన్న అభిమానులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చైనాలో వింత ట్రెండ్.. గోల్గప్పతో లైవ్ ఫిష్ ని తింటున్న ప్రజలు..
చైనాలో వింత ట్రెండ్.. గోల్గప్పతో లైవ్ ఫిష్ ని తింటున్న ప్రజలు..
బ్రిటన్ ఎన్నికలు.. రిషి సునాక్‌, కైర్ స్టార్మర్ మధ్యే పోటీ..
బ్రిటన్ ఎన్నికలు.. రిషి సునాక్‌, కైర్ స్టార్మర్ మధ్యే పోటీ..
గ్రాండ్‏గా వరలక్ష్మి శరత్ కుమార్ రిసెప్షన్..
గ్రాండ్‏గా వరలక్ష్మి శరత్ కుమార్ రిసెప్షన్..
121 కి చేరిన మృతుల సంఖ్య.. హత్రాస్ దారుణంపై నొరు విప్పిన బోలేబాబా
121 కి చేరిన మృతుల సంఖ్య.. హత్రాస్ దారుణంపై నొరు విప్పిన బోలేబాబా
ఇలాంటి అలవాట్లున్న స్త్రీలను భార్యగా పొందిన భర్తకు అన్నీ కష్టలేనట
ఇలాంటి అలవాట్లున్న స్త్రీలను భార్యగా పొందిన భర్తకు అన్నీ కష్టలేనట
కాలుష్యం కోరల్లో భారత్.. శ్వాస తీసుకుంటే గాల్లోకి ప్రాణాలు..
కాలుష్యం కోరల్లో భారత్.. శ్వాస తీసుకుంటే గాల్లోకి ప్రాణాలు..
అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? కొవ్వును వెన్నలాకరిగించాలంటే
అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? కొవ్వును వెన్నలాకరిగించాలంటే
తప్పతాగి.. పిచ్చి పిచ్చిగా చేసి.. నెట్టింట హీరోయిన్ వీడియో వైరల్
తప్పతాగి.. పిచ్చి పిచ్చిగా చేసి.. నెట్టింట హీరోయిన్ వీడియో వైరల్
బిగ్ బాస్ 8లోకి ముగ్గురు.. ఇక షో దబిడి దిబిడే
బిగ్ బాస్ 8లోకి ముగ్గురు.. ఇక షో దబిడి దిబిడే
గుడ్ న్యూస్.. తెరపైకి వస్తున్న జూనియర్ లయన్‌
గుడ్ న్యూస్.. తెరపైకి వస్తున్న జూనియర్ లయన్‌