యాపిల్ లవర్స్ కి అదిరిపోయే న్యూస్.. అక్టోబర్ 13న ఏం జరగబోతోంది తెలిస్తే షాక్
యాపిల్ స్మార్ట్ హోమ్ విభాగంపై మరింత దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 13న ఒకేసారి మూడు కొత్త డివైజ్‌లను తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. కొత్త ప్రాసెసర్లు, మెరుగైన సిరి ఏఐ ఫీచర్లతో ఇవి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆలస్యమైన ఈ ఉత్పత్తులు ఇప్పుడు వినియోగదారుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. వీటిలో కొత్త HomePod ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రైవసీకి కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.

ఇంట్లోని పరికరాలను ఒకే చోట నుంచి నియంత్రించుకునేలా యాపిల్ కొత్త ఉత్పత్తులను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త HomePod, HomePod Mini, Apple TVలో వేగవంతమైన ప్రాసెసర్లు, మెరుగైన సిరి సామర్థ్యాలు అందించే అవకాశం ఉంది. ముఖం, గొంతు గుర్తింపు వంటి ఫీచర్లతో వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచే ప్రయత్నం కనిపిస్తోంది. అయితే ఈ వివరాలపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వీటిని అంచనాలుగానే చూడాలి.
6 అంగుళాల డిస్‌ప్లేతో కొత్త HomePod..
ఈ లైనప్‌లో కొత్త HomePodపై ఎక్కువ ఆసక్తి నెలకొంది. ఇది 6 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుందని సమాచారం. పాత iMac G4 డిజైన్ నుంచి స్ఫూర్తి పొందిన రూపంతో టేబుల్‌పై పెట్టుకోవడంతో పాటు గోడకు అమర్చుకునే అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. ఇంట్లోని స్మార్ట్ డివైజ్‌లను నియంత్రించడంతో పాటు ముఖం, గొంతును గుర్తించే ఫీచర్లు ఇందులో ఉండే అవకాశం ఉంది.
దీంతో వ్యక్తికి సంబంధించిన మెసేజ్‌లు, క్యాలెండర్ వివరాలను ఇతరులు చూడకుండా రక్షించే విధానం ఉండొచ్చని సమాచారం. విజిటర్ మోడ్ కూడా అందించే అవకాశం ఉంది. అయితే వీటిపై తుది వివరాలు లాంచ్ సమయంలోనే స్పష్టమయ్యే అవకాశం ఉంది.
HomePod Mini, Apple TVలోనూ కీలక మార్పులు..
చాలా కాలం తర్వాత కొత్త HomePod Mini కూడా వచ్చే అవకాశం ఉంది. బయటకు ప్రస్తుత మోడల్‌ను పోలి ఉన్నప్పటికీ లోపల మరింత శక్తివంతమైన ప్రాసెసర్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. దీంతో సిరి కమాండ్లకు వేగంగా స్పందించడంతో పాటు పింక్, గ్రీన్ వంటి కొత్త రంగులు అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది.
Apple TVలోనూ వేగవంతమైన ప్రాసెసర్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. దీంతో మెనూ నావిగేషన్, సిరి కమాండ్లు మరింత వేగంగా పనిచేయవచ్చని సమాచారం. భవిష్యత్తులో ప్రైవసీపై దృష్టి పెట్టే సెక్యూరిటీ కెమెరా, మనుషుల కదలికలకు అనుగుణంగా తిరిగే 9 అంగుళాల డిస్‌ప్లేతో రోబోటిక్ ఆర్మ్‌ను కూడా తీసుకురావాలని సంస్థ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
