AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా.. కానీ కాదని తెలిసింది.. ఆ సమయంలో అన్నీ కోల్పోయానని అర్ధమైంది

రీతూ చౌదరి.. రీసెంట్ డేస్ లో బాగా వినిపించిన పేరు ఈ అమ్మడిదే.. పలు వార్తల్లో నిలిచింది. అలాగే బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొంది. బిగ్ బాస్ హౌస్ లో డిమాన్ పవన్ తో ప్రేమాయణం నడిపి సందడి చేసింది. మేము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పినప్పటికీ బయట మాత్రం ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ రకరకాల వార్తలు వచ్చాయి.

ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా.. కానీ కాదని తెలిసింది.. ఆ సమయంలో అన్నీ కోల్పోయానని అర్ధమైంది
Rithu Chowdary
Rajeev Rayala
|

Updated on: Apr 19, 2026 | 11:51 AM

Share

రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా ఈ ముద్దుగుమం మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ అందాల భామ బిగ్ బాస్ లోనూ పాల్గొంది. ఇక ఇప్పుడు ఈ చిన్నది సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటుంది. అలాగే పలు టీవీ షోల్లో పాల్గొంటూ మెప్పిస్తుంది. ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇంటర్వ్యూలో రీతూ చౌదరి మాట్లాడుతూ.. తన జీవితంలోని అత్యంత బాధాకరమైన విషయాలపై స్పందించింది. ముఖ్యంగా తన బ్రేకప్‌లు, ఆ తర్వాత ఎదుర్కొన్న మానసిక ఆందోళనల గురించి ఆమె తెలిపింది. రీతూ చౌదరి మాట్లాడుతూ.. తనకు రెండు బ్రేకప్‌లు అయ్యాయని, అయితే ఇటీవల జరిగిన బ్రేకప్ తనను తీవ్రంగా ప్రభావితం చేసిందని తెలిపింది.

30కి పైగా సినిమాలు, 40కి పైగా టీవీ షోలు.. కట్ చేస్తే ఇప్పుడు ఆ జిల్లాకు కలెక్టర్

దాదాపు ఏడు నుంచి ఎనిమిది నెలల పాటు ఆ బాధ తనను వెంటాడిందని ఆమె వెల్లడించారు. ఈ బ్రేకప్ కారణంగా తాను “అన్నీ కోల్పోయానని”, అందులో స్నేహితులు కూడా ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బ్రేకప్ వల్ల కలిగిన నష్టం కేవలం వ్యక్తిగత సంబంధానికి మాత్రమే పరిమితం కాలేదని, దానివల్ల తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తులను కూడా దూరం చేసుకున్నానని రీతూ చౌదరి తెలిపింది. ఈ కష్టకాలంలో ఆమె ఎలా కోలుకున్నారా అని అడగగా, ఆ బాధ నుంచి బయటపడటానికి ప్రయత్నించిన తీరును ఆమె పంచుకున్నారు. ఈ సమయంలో ఆమె కొందరు స్నేహితులతో మాట్లాడే ప్రయత్నం చేయగా, వారు కూడా తనను అవైడ్ చేశారని తెలిపింది. రీతూ చౌదరి తన జీవితంలో ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉందని, ఆ స్నేహితురాలిని కూడా ఈ బ్రేకప్ కారణంగా కోల్పోయానని తెలిపింది.

ఇవి కూడా చదవండి

16ఏళ్ల వయసులో ఎంట్రీ.. 1000కి పైగా సినిమాలు.. చనిపోయే వరకు నటించిన నటి

తన మాజీ ప్రియుడి కారణంగానే ఆ స్నేహితురాలు కూడా దూరమైందని ఆమె పేర్కొన్నారు. మొదట ఆ స్నేహితురాలిని తన బెస్ట్ ఫ్రెండ్‌గా భావించినప్పటికీ, ఆమె నిజమైన స్నేహితురాలు కాదని తర్వాత అర్థమైందని రీతూ తెలిపింది. ఈ విషయం తనను మరింతగా కృంగదీసిందని ఆమె చెప్పుకోకోహిండి. లవ్ బ్రేకప్ కంటే ఫ్రెండ్‌షిప్ బ్రేకప్ తనను ఎక్కువగా బాధించిందని రీతూ చౌదరి తెలిపింది. ఈ మాట వెనుక ఒక బలమైన కారణం ఉంది. తన తండ్రి మరణించిన తర్వాత, ఆ తండ్రి స్థానాన్ని తన బెస్ట్ ఫ్రెండ్‌కే ఇచ్చానని, అందుకే ఆ స్నేహం తెగిపోవడం తనను మరింత లోతుగా బాధించిందని ఆమె తెలిపింది. ఈ అనుభవం నుంచి తాను బయటపడటానికి చాలా సమయం పట్టిందని, జీవితం ఇలానే ఉంటుందని అర్థం చేసుకున్నానని ఆమె తెలిపింది. నాన్న పోయినప్పుడు కూడా ఇలాంటి బాధనే అనుభవించానని, మిగతా వాళ్లు ఎంత చేసినా అది తక్కువే అని భావించానని రీతూ చౌదరి చెప్పుకొచ్చింది.

అబ్బో.. ఈ అమ్మడు మామూల్ది కాదు..! చేసింది 7 సినిమాలు ఆస్తిమాత్రం రూ. 700కోట్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us