కృతి శెట్టి. ఈ చిన్నది తెలుగు, తమిళ సినిమాల్లో పని చేస్తూ బిజీగా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ 2003 సెప్టెంబరు 21న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది.
ముంబైలో పెరిగింది. ఆమె తండ్రి కృష్ణ శెట్టి వ్యాపారవేత్త, తల్లి నీతి శెట్టి ఫ్యాషన్ డిజైనర్.
చిన్నతనం కృతి శెట్టి ఐడియా, షాపర్స్ స్టాప్, పార్లే, లైఫ్‌బాయ్ వంటి పలు బ్రాండ్‌ల వాణిజ్య ప్రకటనల్లో నటించింది.
ఇక ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ ను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. కృతి 2019లో హిందీ చిత్రం సూపర్ 30లో చిన్న పాత్రతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది.
తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేసి మెప్పించింది. కానీ ఈ చిన్నదానికి సాలిడ్ హిట్ మాత్రం పడలేదు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.
కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కృతి రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ కవ్విస్తుంది. ఈ ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.