AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Padukone: రెండోసారి అమ్మానాన్నలు కాబోతున్నాం.. శుభవార్త చెప్పిన దీపికా పదుకొణె.. ఇన్ స్టా పోస్ట్ వైరల్

దీపికా పదుకొణె సిల్వర్ స్క్రీన్ పై కనిపించి సుమారు రెండేళ్లు అవుతోంది. ఆమె చివరిగా 2024 లో ప్రభాస్ కల్కి సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత కూతురికి జన్మనివ్వడంతో దీపిక పూర్తిగా ఇంటికే పరిమితమైంది. ఇప్పుడీ ముద్దుగుమ్మ మరోసారి తల్లికానుంది.

Deepika Padukone: రెండోసారి అమ్మానాన్నలు కాబోతున్నాం.. శుభవార్త చెప్పిన దీపికా పదుకొణె.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
Deepika Padukone
Basha Shek
|

Updated on: Apr 19, 2026 | 12:18 PM

Share

బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ దీపికా పదుకొణె, రణ్‌ వీర్ సింగ్ తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాము రెండో బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం దీపిక గర్భంతో ఉంది. ఈ శుభవార్తను ఆమెనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సందర్భంగా తమ ముద్దుల కూతురు దువా పదుకొణె సింగ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పాజిటివ్ ఫలితాన్ని చూపిస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు దీపికా పదుకొణె- రణ్ వీర్ సింగ్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ లది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట 2018లో ఇటలీ వేదికగా పెళ్లి పీటలెక్కారు. వీరి అన్యోన్య దాంపత్య బంధానికి ప్రతీకగా 2024 సెప్టెంబర్ 8న దువా పదుకొణె సింగ్ పుట్టింది. ఇప్పుడు మళ్లీ అమ్మానాన్నలు కాబోతున్నారీ లవ్లీ కపుల్. దీంతో వీరి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఇక సినిమాల విషయానికొస్తే రణ్‌వీర్ ప్రస్తుతం ‘ధురందర్ 2’ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. మార్చి 19న విడుదైలన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏకంగా 1800 కోట్లకు పైగా నే కలెక్షన్లు సాధించింది. అంతకు ముందు ధురంధర్ పార్ట్ 1 కూడా 1300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక దీపిక పదుకొణె విషయానికి వస్తే.. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ సరసన ‘కింగ్’ చిత్రంలో నటించనుందీ అందాల తార. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు అల్లు అర్జున్‌- అట్లీ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న రాకా మూవీలోనూ హీరోయిన్‌గా చేస్తోంది దీపికా పదుకొణె.

ఇవి కూడా చదవండి

దీపికా పదుకొణె ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

భర్తతో దీపికా పదుకొణె..

కూతురు దువాతో దీపిక- రణ్ వీర్ సింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us