AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: రోజూ పని మనుషుల పాదాలకు నమస్కరిస్తా.. వాళ్లను వేరుగా చూడలేను: రష్మిక

ఇటీవల కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. తన లైఫ్‌స్టైల్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.

Rashmika Mandanna: రోజూ పని మనుషుల పాదాలకు నమస్కరిస్తా.. వాళ్లను వేరుగా చూడలేను: రష్మిక
Rashmika Mandanna
Basha Shek
|

Updated on: Mar 25, 2023 | 9:30 AM

Share

పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో ఫేమస్‌ అయిపోయింది రష్మిక మందన్నా. సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్‌ క్రేజ్‌ తెచ్చుకుంటోంది. అదే సమయంలో తన వ్యాఖ్యలతో తరచూ వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇటీవల కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. తన లైఫ్‌స్టైల్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘ నాకు వచ్చిన గుర్తింపును చూసి అమ్మానాన్నలు అంతలా గర్వపడరు. ఎందుకంటే వారు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటారు. అసలు నేనేం చేస్తున్నాననేది కూడా వాళ్లకు అర్థం కాదు. అయితే ఎప్పుడైనా ఏదైనా అవార్డు వచ్చిందంటే మాత్రం తెగ సంబరపడిపోతారు. వాళ్లు నన్ను చూసి గర్వపడాలంటే నేనింకా చాలా సాధించాల్సి ఉందని అర్థమైంది. అమ్మానాన్న నన్ను ఏ లోటూ లేకుండా పెంచారు. అందుకు నేనెప్పుడూ కృతజ్ఞురాలినే! ఇప్పుడు నా వంతు వచ్చింది. నేను వాళ్లను బాగా చూసుకుంటాను. నా లైఫ్‌ స్టైల్‌ విషయానికొస్తే.. చిన్నచిన్న విషయాలు కూడా నాకెంతో ముఖ్యమైనవి’

‘నేను లేవగానే నా కుక్కపిల్లలతో ఆడుకుంటాను. అది మనసుకు ఎంతో హాయినిస్తుంది. మన మాటలు ఎంతో శక్తివంతమైనవి. ఆ మాటలతో మనిషిని నిలబెట్టవచ్చు. అదే మనిషి మనసును ముక్కలు చేయవచ్చు. నేను నా డైరీలో ప్రతి చిన్న విషయాలు కూడా రాసుకుంటాను. నేను ఇంటికి రాగానే అందరి పాదాలకు నమస్కరిస్తాను. నా కుటుంబ సభ్యులవి మాత్రమే కాదు మా ఇంట్లో ఉండే పనివాళ్ల కాళ్లకు సైతం నేను నమస్కరిస్తాను. వాళ్లను వేరుగా చూడడం నాకు ఏ మాత్రం ఇష్టముండదు. నాకు అందరినీ గౌరవించడం మాత్రమే తెలుసు’ అని తన గురించి చెప్పుకొచ్చింది రష్మిక. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తోంది. అలాగే రణ్‌బీర్‌ కపూర్‌ సరసన యానిమల్‌, నితిన్‌తో కలిసి మరో మూవీలో హీరోయిన్‌గా కనిపించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

'ది రాజాసాబ్' ఈవెంట్‌లో డైరెక్టర్‌ మారుతి కూతురును చూశారా? వీడియో
'ది రాజాసాబ్' ఈవెంట్‌లో డైరెక్టర్‌ మారుతి కూతురును చూశారా? వీడియో
శీతాకాలంలో బెల్లం తినడం సురక్షితమేనా.. అసలు విషయం తెలిస్తే..
శీతాకాలంలో బెల్లం తినడం సురక్షితమేనా.. అసలు విషయం తెలిస్తే..
టీమిండియాలో భారీ మార్పులు..అయ్యర్, గిల్ ఇన్..ఆ ఇద్దరు అవుట్?
టీమిండియాలో భారీ మార్పులు..అయ్యర్, గిల్ ఇన్..ఆ ఇద్దరు అవుట్?
ఉదయం నిద్ర లేవగానే ఈ పనులు అస్సలు చేయొద్దు!
ఉదయం నిద్ర లేవగానే ఈ పనులు అస్సలు చేయొద్దు!
దోస్త్ మేరా దోస్త్.. కొండముచ్చు, రెండు కుక్కలు ఏం చేశాయో తెలుసా..
దోస్త్ మేరా దోస్త్.. కొండముచ్చు, రెండు కుక్కలు ఏం చేశాయో తెలుసా..
గ్రామంలో 30 ఏళ్ల తర్వాత తొలిబిడ్డ జననం! కోట్లు ప్రకటించిన ప్రధాని
గ్రామంలో 30 ఏళ్ల తర్వాత తొలిబిడ్డ జననం! కోట్లు ప్రకటించిన ప్రధాని
కింగ్ మళ్ళీ టెస్టుల్లోకి వస్తాడా? సిద్ధూ ఆశ.. అభిమానుల శ్వాస
కింగ్ మళ్ళీ టెస్టుల్లోకి వస్తాడా? సిద్ధూ ఆశ.. అభిమానుల శ్వాస
ప్రపంచంలోనే అత్యధిక వెండి నిల్వలు కలిగిన టాప్-5 దేశాలు ఇవే..
ప్రపంచంలోనే అత్యధిక వెండి నిల్వలు కలిగిన టాప్-5 దేశాలు ఇవే..
ఒకప్పుడు రంజీ క్రికెటర్.. చిరంజీవిని చూసి హీరో అయిపోయాడు..
ఒకప్పుడు రంజీ క్రికెటర్.. చిరంజీవిని చూసి హీరో అయిపోయాడు..
కొడుకు మరణం తట్టుకోలేక తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య..
కొడుకు మరణం తట్టుకోలేక తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య..