AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Rambha: ఫ్యామిలీతో కలిసి గురువాయూర్ ఆలయంలో రంభ.. కూతురు ఎంత అందంగా ఉందో చూశారా.. ?

తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించి అలరించారు. అల్లరి ప్రేమికుడు, అల్లుడా మజాకా, బావగారూ బాగున్నారా, బొంబాయి ప్రియుడు ఇలా అనేక సినిమాల్లో కనిపించింది. హీరోయిన్ గా ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రంభ అటు స్పెషల్ సాంగ్స్ లో సత్తా చాటింది. అల్లు అర్జున్ నటించిన దేశ ముదురు సినిమాలో స్పెషల్ సాంగ్ అదరగొట్టింది.

Actress Rambha: ఫ్యామిలీతో కలిసి గురువాయూర్ ఆలయంలో రంభ.. కూతురు ఎంత అందంగా ఉందో చూశారా.. ?
Rambha
Rajitha Chanti
|

Updated on: Jul 04, 2024 | 5:25 PM

Share

దక్షిణాది సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగిన వారిలో రంభ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ రంభ ఫేవరేట్ హీరోయిన్. విజయవాడకు చెందిన రంభ.. విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్ నటించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించారు. అందంతోపాటు అద్భుతమైన నటనతో మెప్పించి అప్పట్లో కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్ గా మారారు. తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించి అలరించారు. అల్లరి ప్రేమికుడు, అల్లుడా మజాకా, బావగారూ బాగున్నారా, బొంబాయి ప్రియుడు ఇలా అనేక సినిమాల్లో కనిపించింది. హీరోయిన్ గా ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రంభ అటు స్పెషల్ సాంగ్స్ లో సత్తా చాటింది. అల్లు అర్జున్ నటించిన దేశ ముదురు సినిమాలో స్పెషల్ సాంగ్ అదరగొట్టింది.

సినిమాలు తగ్గుతున్న సమయంలోనే మలేషియాకు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన రంభ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగు గురువారం ఉదయం రంభ తన ఫ్యామిలీతో కలిసి గురువాయూర్ ఆలయాన్ని సందర్శించింది. ఆమెతోపాటు భర్త ఇంద్ర, ముగ్గురు పిల్లలు, కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ ఉన్నారు. చుడీదార్ లో చాలా సింపుల్ లుక్ లో కనిపించింది రంభ.

అలాగే ఆమె కూతురు కూడా పింక్ చుడీదార్ లో ఎంతో సింపుల్ గా కనిపించింది. తల్లి కంటే మరింత అందంగా.. న్యాచురల్ బ్యూటీగా కనిపించింది. ప్రస్తుతం రంభ ఫ్యామిలీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా..రంభ కూతురిని చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. అందంలో అమ్మను మించి పోయిందని.. సింపుల్ గా ఎంతో చక్కగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.